About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాటి సాయిపథం _ నేటి బాబాల పథం- “భక్తులకి భగవంతుడే రక్ష _ భగవంతునికి రక్షకులే రక్ష “ http://bhamidipatibalatripurasundari.blogspot.in/



నాటి సాయిపథం _ నేటి బాబాల పథం-
భక్తులకి భగవంతుడే రక్ష _ భగవంతునికి రక్షకులే రక్ష
   మానవ రూపంలో తమ ఎదుట నిలిచిన సాయిని భగవంతుని అవతారంగా నమ్మారు ఆనాటి భక్తులు. మధ్యాహ్న హారతి పూర్తయ్యాక గోడ పక్కనే నిలబడి విభూతిని కొందరికి నుదుటి మీద పెడుతూ, కొందరికి నోట్లోవేసి, మరికొందరికి చేతిలో ఉంచి భక్తులందరికీ రకరకాల పద్ధతుల్లో పంచేవారు బాబా.
   బాబా ఆదరంగా పలకరిస్తుంటే భక్తులకి ఎంతో ఆనందం. భోజనం చేశావా...ఆరోగ్యం బాగుందా...నీ కూతురి పెళ్ళికి ఏమయినా సహాయం కావాలా...ఎవరి పలకరింపులు వారికే ! బాబా పలకరింపుకి ఆనందంతోను, భక్తితోను సాష్టాంగ నమస్కారం చేసేవారు భక్తులు. బాబా విభూతిని పంచడం, భక్తులు ఆనందంతో మైమరిచి భక్తిగా అందుకోవడం చూస్తుంటే ఆయన వాత్సల్యము, ప్రేమ భక్తుల భక్తితో పోటీ పడుతున్నట్టు ఉండేది. శావాస్యోపనిషత్తు గురించి తెలియ చేస్తూ...అది వేదాలకి సంబంధించినదనీ, మంత్రాలకి సంబంధించినదాన్ని మంత్రోపనిషత్తు లేదా వాజజనేయోపనిషత్తు...దాని వ్యాఖ్యానాన్నిబృహదారణకోపనిషత్తుఅంటారని వివరించారు.
   దీనిలో ఆత్మ గురించిన వివరణ పద్ధెనిమిది శ్లోకాల్లో ఉందన్నారు. జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని సమన్వయ పరిచి చెప్పబడిన ఈ ఉపనిషత్తు ద్వారా నీతి కవిత్వం, వేదాంతం తెలుసుకోగలగడమే కాకుండా ఆత్మ సాక్షత్కారం గురించి, చావు పుట్టుకల గురించి కూడా వివరించ బడింది. కాబట్టి దాన్ని తెలియ చేయడం ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళ ద్వారానే సాధ్యమన్నారు బాబా.
   శావాస్యోపనిషత్తు గురించి తెలుసుకోవాలని ఉందని, మార్గం చూపించమనీ ఒక భక్తుడు అడిగినప్పుడు మరొక భక్తుడి దగ్గర పని చేస్తున్న పని పిల్ల ద్వారా సందేహ నివృత్తి చేశారు. చేసుకున్న కర్మను బట్టి కష్టాన్నయినా సుఖాన్నయినా కల్పించేది భగవంతుడే అని...రెండింటినీ సమ భావంతో స్వీకరించాలన్నదే ఉపనిషత్తులోని భావమన్నారు శ్రీ సాయినాథుడు.
                                                                *********
     ఎదుటి మనిషినే నమ్మలేని ఈనాటి పరిస్థితుల్లో, స్వయంగా భగవంతుడే ఎదుట వచ్చి నిలిచినా నమ్మలేరు ఈనాటి భక్తులు. గోడ పక్కన డబ్బాలో ఉంచిన విభూతిని డబ్బాలోంచి తీసుకునే లోపునే వెళ్ళండి!వెళ్ళండి!అని అదిలిస్తుంటే...తీసుకున్న విభూతి చేతికి వచ్చిందో లేదో...నుదిటికి అంటిందో లేదో తెలుసుకునే స్థితి ఎక్కడిది ఈ నాటి భక్తులకి?
   ప్రశాంతంగా రెండు ముక్కలు భగవంతుని వైపు చూస్తూ చెప్పుకుందామని దృష్టి భగవంతుని మీద పెట్టి రెండు చేతులూ జోడించే లోపే భూమి తిరుగుడు పెరిగిందో...మనిషి మెదడే తిరుగుతోందో...తిరుగుతున్న మనుషులే తోసేస్తున్నారో...తెలుసుకునే లోపే దేవాలయం లోపలనుండి బయట పడుతున్నారు. భక్తి మాట పక్కన పెడితే అసలు లోపలికి వెళ్ళామా లేదా...దర్శించుకున్నామా లేదా...ఏ పువ్వులతో కట్టిన మాల వేశారు, అలంకారం ఎలా చేశారు గుర్తు చేసుకుందామని కళ్ళు మూసుకుని ఒక మూల కూర్చుంటే లేవండి! లేవండి! ఇక్కడ కూర్చో కూడదు అన్న అదలింపులు. బయటకు వచ్చి ఒక్కసారి ఆలయ గోపురానికో ధ్వజ స్తంభానికో నమస్కరించి భగవంతుణ్ణి స్మరిద్దామంటే మీరు ఇలా దారిలో నిలబడ కూడదు తప్పుకోండి! తప్పుకోండి! అని ఈసడింపులు
   భక్తులు ఎక్కువయ్యారో...అధికారులే ఎక్కువయ్యారో...వారి వెంట ఉండే మందీ మార్బలం ఎక్కువయ్యారో...అందర్నీ రక్షించే భగవంతుణ్ణే రక్షిస్తున్నాము అనుకుంటున్న రక్షకభటులే ఎక్కువయ్యారో...ఎవరు ఎవరితో భేటీయో తెలియనిది ఈనాటి భక్తుల స్థితి.
   తనను తానే మరిచిపోయి చదువుకుందాము అనుకున్న శ్లోకాలు ఆత్మలోనే కలిసిపోయి...అదిలింపులమధ్య తొందరగా బయట పడకపోతే...చావు పుట్టుకల గురించి, మోక్షం గురించి తెలియ చేసే ఆత్మే మిగులుతుందేమో అనే భయంతో...కష్టాన్నే సుఖంగా భావిస్తూ పరుగు పరుగున బయట పడుతున్నారు. నుదిటికి విభూతి సంగతెలా ఉన్న, శరీరం విభూతి కాకుండా ఉంటే చాలు!

1 comment:

  1. vachchevaallalonu teerikagaa svaamini darshimchaalane tapanakamte todaragaa okapani mugiste chaalannatlugaa vumdi

    yadbhaavam tadbhavati
    tappadu

    ReplyDelete