కవిత –“సదువులమ్మ పదాలు...!”
సదువులమ్మా..! సదువులమ్మా..!సంతకెడదామా...?
లక్కపిడతలు
వెతికి తెచ్చుకుందాము
వంటచెయ్యడం బాగా
నేర్చుకుందాము
కాయ కూరలన్నీ
తెచ్చి వండేద్దాము
ఇంటి వంటే కదా
వంటికి మంచిదందాము!
సదువులమ్మా..! సదువులమ్మా..!సంతకెడదామా...?
బంక మట్టి తెచ్చి
బాగా తొక్కేద్దాము
అందమైన కుండలు
చకచకా చెసేద్దాము
నిండా నీరు పట్టి
మూత పెడదాము
కుండ నీటి
చల్లదనం మేలందాము!
సదువులమ్మా..!
సదువులమ్మా...!సంతకెడదామా...?
పక్షుల్ని,
కుందేళ్ళని తెచ్చుకుందాము
చిట్టి చిట్టి
ఇళ్ళు కట్టి పెంచుకుందాము
బలమైన ఆహారం
తెచ్చి పెడదాము
భూత దయ ఉండాలని
చాటి చెప్దాము!
సదువులమ్మా..!
సదువులమ్మా..!సంతకెడదామా...?
కిడ్డీ బ్యాంకులు
పెద్దవి తెచ్చుకుందాము
నాన్నఇచ్చిన
డబ్బులు దాచి పెడదాము
చదువుకోలేని
తమ్ముళ్ళని చదివిద్దాము
చదువు అందరికీ
అవసరమని చెప్పి వద్దాము !
సదువులమ్మా..! సదువులమ్మా..!సంతకెడదామా...?
మేలైన ఆకుకూర
విత్తనాలు ఏరి కొందాము
ఇంటి పెరటిలో చల్లి
నీళ్ళు పోద్దాము
ఇంటి ఖర్చు కొంత
మనం తగ్గిద్దాము
ఆకు కూరలే
ఆరోగ్యమని తెలియ చెప్దాము!
No comments:
Post a Comment