About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాటి సాయిపథం _ నేటి బాబాలపథం-“ఆత్మ సాక్షాత్కారం _ ఆత్మల సాక్షాత్కారం “ http://bhamidipatibalatripurasundari.blogspot.com/నాటి సాయిపథం _ నేటి బాబాలపథం-ఆత్మ సాక్షాత్కారం _ ఆత్మల సాక్షాత్కారం

   కామధేనువు, కల్పతరువు కూడా బాబా ముందు తక్కువే!అవి అడిగినవే ఇస్తాయి.భక్తులకు ఏది అవసరమో తెలుసుకుని దాన్నే ఇస్తారు బాబా.ఇది ఆనాటి భక్తుల నమ్మకం.డబ్బుందన్న అహంకారంతో కోట్లిచ్చినా భగవ౦తుడు స్వీకరించడు.భక్తితో గడ్డి పరక ఇచ్చినా స్వీకరిస్తాడు అన్నారు బాబా.
   బ్రహ్మజ్ఞానం పొందడానికి కావలసిన అర్హతలు వివరించారు.ఆధ్యాత్మిక చింతన కావాలి.కోరికలు ఉండకూడదు.ప్రపంచాన్ని కళ్ళతో చూసి అనందిస్తున్నట్టే జ్ఞాన నేత్రంతో ఆత్మదర్శనం కూడా చేసుకోగలగాలి.ఆత్మ దర్శనం పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి.సత్యమే పలకాలి,దానధర్మలు చెయ్యాలి,మంచి నడవడిక ఉండాలి. దుర్మార్గులకు దూరంగా ఉండాలి. నిరంతరం భగవన్నామ స్మరణం చెయ్యాలి. అందరిలోను భగవంతుడు ఉన్నాడని గుర్తించాలి. సమాజంలో జరుగుతున్న చెడుని అడ్డుకుని మంచి జరిగేట్టు చూడాలి. అన్నిటికంటే మనసుని అదుపులో పెట్టుకోవాలి! అన్నారు బాబా.
   మనస్సును అదుపులో పెట్టుకోవడమంటే ఏమిటో కూడా వివరించారు.శరీరాన్ని ఒక రథంగా అనుకుంటే ఇ౦ద్రియాలు ఆ రథానికి గుర్రాలు.బుద్ధి రథ సారథి.బుద్ధి అదుపులో ఉన్నప్పుడు ఇంద్రియాలు మనం చెప్పినట్టు వింటాయి.మనసుకి కళ్ళెం వేసి ఇంద్రియాల్ని అదుపులో పెట్టగలిగిన వాళ్ళు ఆత్మదర్శనం పొందగలరు. దీన్నే ఆత్మసాక్షాత్కరం అంటారు.
   దీన్ని పొందాలంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ధనం మీద ఆశ పోవాలి. అహంకరం వదలాలి.కోరికలు ఉండకూడదు.వైరాగ్య చింతన కలగాలి.శరీర వ్యామోహం పనికిరాదు.ఏకాగ్రతతో ధ్యానిస్తేనే ఆత్మసాక్షాత్కరం లభిస్తుంది
   తనను తను పరిపూర్ణంగా దర్శించగలిగిన వాడే బ్రహ్మజ్ఞాని! అన్నారు శ్రీ సాయినాథుడు!

                                                                 ********

   ఈనాటి బాబాలు కూడా భక్తులు ఏది అడిగితే అదే ఇస్తున్నారు. భక్తులకి నేటి బాబాల మీద ఉన్న నమ్మకం అదే! కాని, భక్తి ఎ౦త ఉన్నా బాబాలకి సమర్పి౦చుకునేది బాబాల తాహతుని బట్టే ఉండాలి.లేకపోతే అ భక్తుడు బాబాలకి గడ్డి పరకతో సమానం!
   కోరికలతో నిండిపోయిన ఆత్మని దర్శించడానికి, జ్ఞానమంటే ఏమిటో తెలియని జ్ఞాన నేత్ర౦తో చూడమనడం, ఆత్మదర్శనమంటే ఏమిటో తెలియని వాళ్ళకి బ్రహ్మజ్ఞనం గురించి బోధించడం ఆనాటి బాబాలకే చెల్లింది.సమాజంలో మొత్తం చెడే నడుస్తున్నప్పుడు అడ్డుకునే అవకాశం ఎక్కడుంది? నిరంతర భగవన్నామం అయితే చెయ్యగలం కానీ, అందరిలోనూ భగవంతుణ్ణి చూడాలంటే అందరి భగవంతుడూ ఒక్కడు కాదుగా...కష్టమే మరి!
   ఎవరి మనసు వాళ్ళకి అధీనంలో ఉంటే అదుపులో పెట్టచ్చు. మనసులన్నీ బాబాల అధీనంలోనే ఉన్నప్పుడు ఎవరికి వారు అదుపులో పెట్టుకోడం కష్టమే!అ౦దరి ఇ౦ద్రియాల్ని అదుపులో పెట్టుకోగలిగిన బుద్ధిని బాబాలు తమ అదుపులోనే ఉంచుకున్నప్పుడు వాటికి సంబంధించిన శరీరాలకు బాబాలేగా రథసారథులు. అందరి ఆత్మల్నీ దర్శించ గలిగినవారు కూడా బాబాలే! దీన్నే ఆత్మల సాక్షాత్కారం అంటారు.
   ధనం మీద ఆశ,కోరిక,అహంకారం,శరీరాల మీద వ్యామోహం,రక్తి కలిగి ఉన్నఫ్ఫుడే అత్మల సాక్షాత్కారం కలుగుతుంది. సంపూర్ణ ఆత్మల సాక్షాత్కారం పొందిన వాడే ప్రపంచజ్ఞాని!!

3 comments:

 1. మీ బ్లాగుని పూదండతో అనుసంధానించండి.

  www.poodanda.blogspot.com

  ReplyDelete
 2. చాలా గొప్పగా ఉందండి మీ కృషి. చాలా సంతోషం. నెనర్లు.
  గణనాధ్యాయి
  http://www.telugubhagavatam.com/

  ReplyDelete
 3. chala bagunnayi meeru cheppe vishayalu , keep it up mam

  ReplyDelete