About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
మన ఆరోగ్యం మాసపత్రిక అక్టోబరు 2018                                                                            
                                                                                                          భమిడిపాటి బాలాత్రిపురసుందరి                          
                                                                                               9440174797
శరన్నవరాత్రులు
యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః||
   ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మనకు అమ్మ ఇచ్చిన అవకాశం.
   శివునివల్ల రాత్రి ప్రాశస్త్యాన్ని గూర్చి తెలుసుకున్న పార్వతీదేవికి శివుడు నవరాత్రులు ఆ తల్లి పేరిట పవిత్ర దినాలుగా వర్ధిల్లేటట్లు వరమిచ్చాడు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, శ్వయుజ మాసంలో శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. శరన్నవరాత్రులనే  'దేవీనవరాత్రులు' అని, దసరా అని అంటాం.
     శరత్కాల రాత్రులు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి, కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీ మాతను విశేష పూజలతో అర్చించడం వల్ల సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.
   నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అమ్మవారి నవశక్తులు గాయత్రీ మాతలో నిక్షిప్తమై ఉన్నాయని పెద్దల భావన. నవరాత్రులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అవి జగన్మాతలోని ఒక్కొక్క కోణాన్ని మనకు చూపిస్తాయి. పూజా విధానాలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ప్రశాంతత, సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం, ఉత్తేత్తేజం పొందడం, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి అమ్మ ఆశీర్వాదం మనకి లభిస్తాయి.
ఆయా తిథుల్లో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి మంత్రం...  పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం
"
దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే -  హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| "  అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి
బాల గాయత్రి : "ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి  - తన్నో బాలా ప్రచోదయాత్‌||
విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసాన్నం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే \ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః ||
అన్నపూర్ణ గాయత్రి : అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||
తదియ - శ్రీమహలక్ష్మి - గుడాన్నం 
మాతర్నమామి కమలే కమలాయతాక్షి -  శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి -  లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||
లక్ష్మీ గాయత్రి :  ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||
"
ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి -  తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||"  అని కూడా జపించవచ్చు.
చవితి - గాయత్రి దేవి -  కట్టు పొంగలి అన్నం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం|
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||  అని జపిస్తే కరుణిస్తుంది.
పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ -  ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||
శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||
షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే -  తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||
దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌
సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||
సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి -  తన్నో వాణీ ప్రచోదయాత్‌||
అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం, కేసరిబాత్‌
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
మహిషాసుర మర్దిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి -  తన్నో మాతా ప్రచోదయాత్‌||
నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం, లడ్డూలు
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌\అంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా\చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||
రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||
   దేవీ ఉపాసన కాలమే... శరన్నవరాత్రులు. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం.
   మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను సత్కరించటం ఆనవాయితీగా వస్తోంది.
 దసరాలలో కుమారీపూజ ప్రత్యేకం 
   నవరాత్రి పూజావిధానాలలో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి నూతన వస్త్రాలను ధరింపజేసి, అమ్మస్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసే పూజను కుమారీ పూజ అంటారు. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో కుమారీలను ప్రత్యేకంగా పూజిస్తారు. 
   శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ, కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాత-లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రి-దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.
   పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడషోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం ఆచారం.
       పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం. సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే.
    దశమి నాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సహాలతో ఉత్సవాలు జరుపుతుంటారు.
  అష్టమి, నవమి, దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాల్ని, వాహనాల్ని పూజించడం జరుగుతోంది. మహిమాన్వితమైన దేవీ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో  పూజలు చేస్తూ దశమిని విజయదశమిగా, దసరాగా పిలుస్తూ పండుగ జరుపుకుంటారు. ఎక్కడ చూసిన భక్తి, పవిత్రత, ప్రభల ఊరేగింపు, వివిధ వేషధారణలతో ఉత్సవాలతో, ఊరేగింపులతో ఎటు చూసినా ఆనందమే వెల్లివిరుస్తూ కనిపిస్తుంది.
   ఆ తొమ్మిది రోజుల్లో అష్టమినాడు మహిషాసురుణ్ని వధించడమే కాకుండా.. శంభనిశంభులు, చండముండులు, రక్తబీజుడు, దుర్గమాసురుడు మొదలైన భయంకరమైన రాక్షసుల్ని ఎందరినో వధించి లోకాల్లో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరంగా ఉండేలా చేసింది జగన్మాత.
    ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, శారీరిక బాధలు, మానసిక బాధలు లేకుండ, అకాలమృత్యువు వాతపడకుండా వుండడానికి దేవీనవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో  చేసి అమ్మ దయకి పాత్రులవాలని కోరుకుంటూ...  

No comments:

Post a Comment