About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
మన ఆరోగ్యం మాసపత్రిక సెప్టెంబరు 2018
                                                                                              
పోలాల అమావాస్య
    శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' గా పిలుచుకుంటూ వుంటారు. దీనినే 'పోలాంబ వ్రతం' లేక కందగౌరీ వ్రతముఅని కూడా అంటారు
   పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. పితృదేవతల్ని, ఆవుల్ని ఎద్దుల్ని పూజించడం, పోలేరమ్మను ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత. పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఒకానొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు, ఆవుల్ని, ఎద్దుల్ని శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించినవాళ్లకి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇచ్చాడని కూడా అంటారు.
   అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో ఆవుల్ని, ఎద్దుల్ని పూజించడం కూడ ఆచరంగా వస్తోంది. ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకి ఆ రోజున విశ్రాంతినిస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు.
   ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ,  పంటలకి సరిపడేలా వర్షాలు కురుస్తాయని నమ్ముతారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి.
   వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆహారం దొరుకుతుంది.తమ జీవనాధారానికి కారణమైన పోలేరమ్మ దేవతని,పెద్దల్ని, పశువుల్ని పూజించే పర్వదినంగా పోలాల అమావాస్యని పండుగగా జరుపుకుంటారు. గ్రామదేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువుల్ని పూజించే పండుగగా ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
    స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, పిల్లల యోగ, క్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం చేసినట్టు ఈ పోలాల అమావాస్య వ్రతంప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చేస్తారు. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు సంతానం పొందడం కోసము, సంతానం కలిగిన స్త్రీలు తమ సంతానం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
   ఈ పూజలో ఆడపిల్లలు కావాలనుకునేవాళ్లు గారెల దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావాలనుకునేవాళ్లు అనే కోరిక కలవారు పూర్ణం బూరెల దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయకూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
వ్రతవిధానము
   పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువెయ్యాలి. ఒక కందమొక్కని, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలని సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా వినాయకుణ్ని పూజించాలి. ఆ తర్వాత ఆ కందమొక్క లోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ  ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి.
   ఎక్కువ సంతానం కలిగిన పెద్దముత్తయిదువుని పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి.
  అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారని నమ్మకం.  పూర్ణంబూరెలు వాయనంగా ఇవ్వడానికి కారణం కూడా లేకపోలేదు. పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక మన పూర్వీకులు పూర్ణంబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని పెట్టి ఉంటారు.
వ్రతకథ
   పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది.
   అందువల్ల ఆ ఆరు సంవత్సరాలూ పోలాల అమావాస్య వ్రతంచేసుకోవడం ఏ కోడలికీ కుదరలేదు. అందుచేత సుగుణంటే వాళ్లకి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవాళ్లు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకోడళ్ళు నిర్ణయించుకున్నారు.
   సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని అనుకుని, చనిపోయిన  బిడ్డని తన  గదిలోనే దాచింది. తరువాత ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్నిఆచరించింది.
   తన ఇంటికి వచ్చిన తరువాత మరణించిన తన బిడ్డని ఎత్తుకుని కన్నీటితో  స్మశానానికి వచ్చి, అంతకుముందు మరణించిన తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చుంది. అప్పటికి బాగా చీకటి పడింది.
   ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావుఅని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాళ్లని పిలుఅని చెప్పి మాయమైపోయింది.
   సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రుల్ని పేరుపేరునా ప్రేమగా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వాళ్లని దగ్గరకు తీసుకుని,  వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు.
   ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ పోలేరమ్మని పూజిస్తూ, పిల్లా,పాపలతో ఆనందంగా జీవించింది. ఈ కథ విన్నంతసేపు చేతిలో పట్టుకున్న అక్షింతల్ని పెద్దవాళ్లు చిన్నవాళ్ల తల్లమీద వేసి తమ తలమీద కూడా వేసుకోవాలి. అలా చెయ్యడం వల్ల పోలేరమ్మతల్లి అనుగ్రహిస్తుంది అని భక్తుల నమ్మకం.
   పోలాల అమావాస్యని పండుగలా జరుపుకోవడం దక్షిణ రాష్ట్రాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలేరమ్మ పండగగా జరుపుకుంటారు.మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికిసంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు.
   ఇప్పుడు మ్యుఖ్యమైన పండగలకి కూడా కుటుంబ సభ్యులు కలవడమే గగనం అయిపోతోంది. మన పూర్వీకులు చేసుకున్న పండగలలో కొన్నిటిని హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే  చెయ్యకుండా వదిలేస్తున్నాం.
'పొలాల అమావాస్య' భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని పూజించి ఆమె ఆశీస్సులు పొందుదాం! 


ఎత్తుకుని కన్నీటితో  స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావుఅని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలుఅని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది. వ్రత విధానం ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కంతానలక్ష్మీదేవిని గానీ  ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా

No comments:

Post a Comment