About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

భక్తకవులు
భక్తరామదాసు
     తెలుగుదేశంలో జన్మించిన భక్తకవుల్లో భద్రాద్రిక్షేత్రంలో ఉన్న శ్రీరామచంద్రప్రభువు దేవాలయాన్ని ఉద్ధరించినవాడు, రాముడి అనుగ్రహన్ని పొందినవాడు కంచర్లగోపన్న. ఈయనకి భద్రాద్రిరామదాసు, భద్రాచలరమదాసు అని కూడా పేర్లు ఉన్నాయి. భక్తుడే కాకుండ భద్రాద్రిరాముడి మీద అనేక కీర్తనలు రాసి పాడినవాడు.
   గోపన్న 1620-1680 సంవత్సరముల మధ్యవాడు. అంటే సుమారు పదిహేడవ శతాబ్దంవాడు. దక్షిణ భారతదేశాన్ని నవాబులు పరిపాలిస్తున్న కాలం. ఈనాటి వరంగల్లు, ఖమ్మం గోదావరి జిల్లాల ప్రాంతాన్ని ఆనాటి నవాబు అబుల్ హసన్ తానీషా అన్ని మతాల్ని సమానంగా చూస్తూ పాలించేవాడు. అక్కన్న, మాదన్న అని పిలవబడే ఇద్దరు బ్రాహ్మణ మంత్రుల్ని సలహాదారులుగ నియమించాడు. అక్కన్న మాదన్నల మేనల్లుడే గోపన్న.
   ఆంద్రప్రదేశ్ ఉత్తరాన ఉన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో కామాంబ, లింగమూర్తి దంపతులకి జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న గోపన్న మంచిచెడ్డలు మేనమామలు అక్కన్న మాదన్నలు చూశారు. వాళ్ల సహయంతోనే తానీషా దగ్గర ఉద్యోగం సంపాదించుకుని తన మంచితనంతో పాలవంచ పరగణాకి తాసిల్దారుగా నియమించబడ్డాడు. ఆ సమయంలోనే మహయోగుల అనుగ్రహంతో సాక్షాత్తూ కబీరే తారకమంత్రాన్ని ఉపదేశించాడని, రామనామాన్ని ఉచ్చరిస్తూ రామదాసుగా ప్రసిద్ధిపొందాడని చెప్తారు.
   ఉద్యోగరీత్యా పన్నుల వసూలుకి వెళ్లినప్పుడు భద్రగిరిమీద పోకల దమ్మక్క పూజించిన శ్రీరమచంద్రమూర్తి విగ్రహం కనిపించింది. అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుండేది. భద్రాద్రిలో శ్రీరాముడు సీతాదేవితోను, లక్ష్మణుడితోను ఒక పర్ణశాల నిర్మించుకుని చాలాకాలం నివసించాడు. శ్రీరాముడు శబరిని కలిసింది, పోతనగారికి భాగవతాన్ని తెనిగించమని చెప్పింది అక్కడే!
   శ్రీరమచంద్రుడి విగ్రహం ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఉండడాన్ని చూసి రామదాసు బాధపడ్డాడు. గ్రామస్థుల్ని కలిసి ఆలయం కట్టించడానికి సహాయం అడిగాడు. అందుకు వాళ్లు అంగీకరించి పన్నులు వసూలయిన ధనంతో ఆలయ నిర్మాణం ప్రారంభించమని పంటలు చేతికి వచ్చాక మళ్లీ ఇస్తామని చెప్పారు.
   గ్రామస్థుల సలహాప్రకారం వసూలయిన ఆరులక్షల రూపాయలు ఖర్చుపెట్టి అత్యంత సుందరంగా దేవలయాన్ని కట్టించడం ప్రారంభించాడు. ఇంచుమించి పని పూర్తయ్యాక ఆలయశిఖరానికి అతికించడానికి సుదర్శనచక్రం మాత్రం దొరకలేదు.అదే ఆలోచనతో పడుకున్న రామదాసుకి శ్రీరామచంద్రప్రభువు కలలో కనిపించి గోదావరి నదిలో మునిగి వెతకమని చెప్పాడు.
   ఉదయం నిద్రలేస్తూనే పవిత్ర గోదావరికి నమస్కరించి భక్తి శ్రద్ధలతో నదిలో మునిగి వెతికాడు.అందులో సుదర్శనచక్రం కనబడగానే అనందపడ్డాడు. సమస్త వైభవలతో ఆలయాన్ని కట్టించి యజ్ఞయాగాదులతో విగ్రహప్రతిష్ఠ జరిపించి బ్రాహ్మణ సంతర్పణలతో సంప్రోక్షణ చేశాడు. ఇదంతా నవాబు అనుమతి లేకుండానే జరిగింది.
   పన్నులకు వసూలయిన ధనంతో హిందూదేవాలయం కట్టించాడని తానీషాకి తెలిసింది.అక్కన్న మాదన్నల్ని పిలిచి విషయం తెలుసుకుని రమ్మన్నాడు. ప్రభుత్వధనాన్ని ఇచ్చెయ్యమని అడిగారు అక్కన్నమాదన్నలు. తన దగ్గర చిల్లిగవ్వకూడా లేదన్నాడు రామదాసు. ధనాన్ని ఇచ్చేవరకు జైల్లో ఉంచమని చెప్పాడు తానీషా. ఆనాటి హైదరబాదు గోల్కొండ కోటలో ఖైదీగా ఉంచి రామదాసుని శిక్షించారు.
   జైల్లో ఉండి తనని రక్షించమని అనేక విధాలుగ ప్రార్థిసూ నీ దాసుణ్ని కనికరించు అంటూ అయన చెప్పిన పద్యాలు దాశరథీ శతకంగాను, కీర్తిస్తూ పాడిన పాటలు రామదాసు కీర్తనలుగాను ప్రసిద్ధిపొందాయి. నాకిన్ని కష్టాలు వస్తే కాపాడలేవా? నీకిది చెయ్యలేదా? అది చెయ్యలేదా? అని వేడుకుంటూ...భక్తుణ్ని కనికరించమని చెప్పమ్మ అని సీతమ్మని కూడా ప్రార్థించాడు.
     కష్టాల్లో ఉన్నవాళ్లని కరుణతో చూసే రాముణ్ని మించిన దైవం లేడని దాశరథీసతకంలో ఆయన
భండన భీముడార్తజన బాంధవుడు జ్వలబాణతూణకో\ దండ కళాప్రచండ భుజతాండ కీర్తికి రామమూర్తికిన్\ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా\ దాండదదాండ దాండ నినదంబు రజాండమునిండ మత్తవే\ దండము నెక్కిచాటెదను దాశరథీ కరుణాపయోనిధీ| అంటూ ఆణిముత్యంలాంటి పద్యం చెప్పాడు.
   రామదాసు 11, 12 సంవత్సరాలు జైల్లో గడిపాడు. ఆయన కష్టాల్ని చూడలేకపోయాడు రామభద్రుడు. అర్థరాత్రి  రామలక్ష్మణులిద్దరు సిపాయివేషంలో తానీషా అంతఃపురంలోకి వెళ్లి తమ పేర్లు రామోజీ లక్ష్మోజీ అని రామదాసుకి ఇవ్వాల్సిన ధనం తీసుకొచ్చామని చెప్పారు. బంగారు నాణేలతో నిండి ఉన్న మూడు సంచులు తానీషాకిచ్చి రామదాసుకి దాసులమని చెప్పి, ధనం తీసుకుని ఆరులక్షలు ఉన్నాయో లేదో చూసుకోమని రసీదు కూడ అడిగారు. ఇదంతా నవాబుకి ఆశ్చర్యంగా అనిపించినా మర్నాడు ఉదయన్నే జైలుకి వెళ్లి జరిగినదంతా రమదాసుకి చెప్పి అతణ్ని విడుదల చేశాడు.
   రామదాసుకి జైలునుంచి విడుదలయిన ఆనందం కంటె రామచంద్రప్రభువుని చూడలేకపోయానన్న బాధ; నిజంగా ఈ అల్పుడి కోసం రామచంద్రప్రభువే వచ్చాడా! అన్న ఉద్వేగం.. జైల్లో బాధలు పడలేక నా ప్రభువుని నిందించాననే రకరకాల భావాలతో సతమతమయ్యాడు.
   తానీషామాత్రం జరిగినది చూసి చెయ్యవలసింది చేశాడు కాని, దాన్లోంచి తేరుకోలేక ప్రతినిముషం అల్లా! అల్లా! అంటూ రామదాసుని  బాధపెట్టి తప్పుచేసానని బాధపడుతూనే ఉన్నాడు. తనకు రమలక్ష్మణులిచ్చిన బంగారు నాణేలు రామదాసుకి ఇచ్చి క్షమించమని అడిగాడు.
   కాని, రామదాసు అవి తీసుకోడానికి ఇష్టపడలేదు. భగవంతుడిచ్చిన దానికి గుర్తుగా రెండు నాణేలు మాత్రం తీసుకుని మిగిలినవి ప్రభుత్వానికి ఇచ్చేశాడు. ఆ రెండు నాణేలు ఇప్పటికీ రామపట్టాభిషేకమున్న రాజముద్రికతో భద్రాచలంలో భద్రంగా ఉన్నాయి. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి శ్రీరామనవమికి రాముడి కల్యాణవేడుకలకి కానుకలు పంపించడం ఆచారంగా మారింది.
   రామదాసు పాడిన కీర్తనలు రాముడిమీద ఆయనకున్న భక్తి ప్రేమ కలిసి ఉద్వేగంతో ఉంటాయి. తమిళనాడులో ఉన్న పుదుక్కొట్టైని పాలించిన తొండైమాన్లు ఆయన కీర్తనల్ని గౌరవించి ప్రజల్లోకి తెచ్చారు. రామదాసు సంగీతానికి మైమరిచిన త్యాగరాజు ఇంతచక్కటి కూర్పు, ఇంకెవరివల్ల వీలు కాదని అభినందించారు. ఆయన తన సంగీతంలో భద్రాచలం, భద్రాద్రి, భద్రగిరి అంటూ అనేకరకాలుగా భద్రాచలాన్ని పలుకుతూ భద్రాచలప్రాశస్త్యం అన్ని వైపులా వ్యాపించడానికి కారణమయ్యారు. కాంభోజిరాగంలో పాడిన ఏమయ్యారామా.., ధన్యాసిరాగంలో పాడిన రామా దయజూడవేఆనందభైరవిలో పలుకే బంగారమాయెనాకల్యాణి రాగంలో నను బ్రోవమని చెప్పవే.. అంటూ రామదాసు పాడిన పాటలు ప్రపంచం మొత్తం పాడుకుంటున్నారు.
   సాక్షాత్తూ రామచంద్రుడే రామదాసుకి దాసుణ్ని అని చెప్పాడని తెలిసిన దగ్గరనుంచి ఉద్యోగాన్ని వదిలేసి రామనమస్మరణే లోకంగా యోగపుంగవుడిగా మారిపోయాడు. సద్గురువు కబీరు రామదాసుకి కనిపించి గతజన్మలో ఒక చిలుకని పట్టి ఏడు రోజులు పంజరంలో బంధించినందుకే జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని రామతారక మంత్రం వల్ల మరోజన్మ లేదని చెప్పి అదృశ్యమయ్యాడు.
   ఆనాడు రామదాసు నిర్మించిన రామలయం 1961లో పునరుద్ధరింపబడి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు సీతారాముల కల్యాణం వైభవంగా జరగడమే కాకుండా రాష్ట్రప్రభుత్వం సీతారాములకి పట్టుబట్టలు, మంచిముత్యాలతో తలంబ్రాలు, కానుకలు ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నారు.
   రామదాసు చెయించిన కుచ్చుల తురాయి, పచ్చల పతకం, మొదలైన ఆభరణాలు ఇప్పటికీ సీతారాములు ధరిస్తూనే ఉన్నారు. తారకమంత్ర జపంతో రామదాసుగా మారి, రామభద్రుడి మీద అనేక భక్తి గీతాలు మనకందించిన కంచర్ల గోపన్నకి నమస్సులు.

No comments:

Post a Comment