About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

దుర్మిఖీ! నీకు ఇదే మా స్వాగతం!


దుర్మిఖీ! నీకు ఇదే మా స్వాగతం!

నూతన సంవత్సరమా!  వసంతమాసాన్ని వెంట తీసుకుని
ప్రతి సంవత్సరం ఏదో ఒక పేరుతో వస్తూనే ఉన్నావు...
మాలో కొత్త ఆశలు చిగురింపచేస్తావు...! మామిడి చిగురులా
ఆశలు అందంగానే ఉన్నా.. రుచికి మాత్రం వేప చిగురులా చేదే సుమా!
దుర్ముఖీ! నువ్వు ఎలా ఉంటావో...మాకోసం ఏం తెస్తున్నావో?
ఊహించే ధైర్యం మాకు లేదు... నువ్వు మా ఊహకెప్పుడూ అందవు!
*మేము ఊహించేది ఒకటి...నువ్వు మాకు పంచేది మరొకటి!
మాకు తెలుసులే! నువ్వు చాలా మంచిదానివి..వట్టి చేతులతో మాత్రం రావు!
తెలుగువారి తొలి పండుగగా అడుగుపెట్టి, ఆరు రుచుల ఉగాది పచ్చడితో
పోలుస్తావు... జీవితమంటే సుఖదు:ఖాల కలయికే నంటావు...!
పాడిపంటలే సిరిసంపదలని, పశువుల్ని ఆదరించడం భూతదయని,
వసంత మాధవ పూజలు, వసంతోత్సవం, వసంత నవరాత్రులంటూ
మామిడి చిగుళ్ళు, వేపపూత, కోయిల కూతల మేలుకొలుపులతో...
వసంతమాసంలో అడుగుపెట్టి   ప్రకృతిని పరవశింప చేస్తావు!
చలివేంద్రాల ఏర్పాటు,  చెప్పులు, గొడుగుల దానం,  అన్నదానాలతో..
సూర్యతాపాన్ని తగ్గిస్తూ బాటసారుల్ని ఆదరించమంటావు!
పండుగ రోజు బంధుమిత్రులందరు కలిసి గడపాలంటూ..
ఉన్నవాళ్ళు,  లేనివాళ్ళని ఆదుకోడం... ఆచారమంటూ...
ఇదే పుణ్యకార్యమని భావితరాలకి చాటి చెప్తావు...!
ఉగాదిమొదటి పండుగంటూ...భాష సంస్కృతుల్ని గుర్తు చేస్తావు,
ఆరునెలలు దీక్షలతో... ఆరునెలలు పండుగలతో...
తెలుగు జాతికి...సంస్కృతిని, సంప్రదాయాన్ని నేర్పివెడతావు!
కొత్త సంవత్సరాన్ని!  మళ్ళీ వచ్చానంటూ వస్తూనే ఉంటావు...
పంచాంగ శ్రవణంతో ఆశలు చిగురింపచేస్తావు...మనసులు రంజింపచేస్తావు!
పేరు మార్చినట్టే రూపు మారుస్తావు... ఎప్పుడూ ఉల్లసంగా ఉత్సాహంగా ఉంటావు...
ఎన్ని సంవత్సరాలు పెరిగినా ముదిమి నిన్ను చేరదు...!
కవులందరం కలిసి నిండు మనస్సుతో నిన్ను స్వాగతిస్తున్నాము!!
                                                            భమిడిపాటి బాలాత్రిపురసుందరి

                                                                 సెల్ నం. 9440174797

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete