About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

అవసరానికి వాడుకో..ఆనక విసిరెయ్యి

అవసరానికి వాడుకో..ఆనక విసిరెయ్యి
అటకవైపు చూస్తుంటే ఆనందం...తరతరాల సంపద
తాతలనాటి సామాను..వెలకట్ట వీలుకానిది
హృదయంలో పదిల పరుచుకున్న ఆత్మీయుల్ని తలుచుకుని
అనందించి..పరవశించి మళ్ళీ అటకమీద పదిల పరిచినప్పుడు
పెద్ద తరంతో కలిసిన ఉమ్మడి కుటుంబంతో...
వచ్చిపోయే బంధువులతో..అనురగంతో పలకరించే ఆత్మీయులతో
కేరింతలతో ఆరోగ్యంగా పెరుగుతున్న మరో తరం
చెదకి అందని గట్టితనంతో...చూడగానే అనందాన్ని పెంచుతూ
శరీరానికి ఆరోగ్యం, బుద్ధికి వికాసం, మెదడుకి జ్ఞానం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం
నిండు ఆయుష్షు .. ఇవి కూడా తరతరాల సంపదే!
వంశ చరిత్రె తెలియని వాళ్ళకి దేశ చరిత్ర ఏం తెలుస్తుంది?
నా వంశ వృక్షానికి నేను కూడా అందిస్తాను మంచి ఫలాలు
ఇది ఆనాటి మాట! మరి ఇప్పుడో...
అవసరానికి వాడుకో..! ఆనక విసిరెయ్యి!
వాడుకున్నాక వదిలించుకో అన్నమాటకి శ్రీకారం చుట్టేసి
తరతరాలుగా పదిల పరుచుకున్న జ్ఞాపకాల్ని...
అటకదించి...బజారుకి అమ్మకానికి మళ్ళిస్తే ..
అవసరానికి మించిన ఆధునికత ఇల్లంతా వాడుకుంటోంది
పెరుగుతున్న మరోతరం ముందుకొచ్చి
అవసరానికి వాడుకో...ఆనక విసిరెయ్యి! అనే మాట వస్తువులకే కాదని
వృద్ధులైన తల్లితండ్రులవైపు సాలోచనగా చూసి..
వదిలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని
వట్టిపోయిన పశువుల్ని ట్రక్కులోకి ఎక్కించి పాకల్లోంచి తరిమినట్టు
ఆటోలో ఎక్కించి వృద్ధాశ్రమాల్లోకి తరుముతోంది
అదే తీరు తన దాక వచ్చాక తల్లితండ్రులు గుర్తుకొచ్చి వృద్ధాశ్రమం వైపు పరుగెడితే
ఇచ్చినవన్నీ వాడుకుని ఇంక ఇచ్చేవాళ్ళెవరూ లేరని వదిలించుకున్నాం పొమ్మంటోంది
విరిసిన ప్రతి పువ్వుకి పొద్దు తిరుగుడు తప్పదని
పొద్దు తిరిగిన పువ్వుని పదిల పరిచి దాచుకుంటే
వంశవృక్షం పెద్దదై చరిత్రనే సృష్టిస్తుంది!!



No comments:

Post a Comment