About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
౩౦-4-2017 మహాకవి శ్రీశ్రీ  జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో చదివిన కవిత
విస్తరించిన మహావృక్షం శ్రీశ్రీ
దేనికైనా సరే విత్తు పడాలి! అంకురం మొలకెత్తాలి!
చెట్టుకైనా మనిషికైనా పశుపక్ష్యాదులకైనా...
సృష్టి ఏదైనా విత్తు నాటాలి.. అది అంకురిచాలి.. విస్తరించాలి!
మంచికైన చెడుకైనా సమాలోచనకైనా సమరానికైనా..
సమాజానికి మంచి జరగాలన్నా...సమాజంలో ఉన్న చెడు
సమూలంగా నాశనమవాలన్నా...దేనికైనా అంకురార్పణ జరగాలి!
సమాజ శ్రేయస్సుకి కృషి చేసేవాడు కవి.. శ్రేష్ఠమైన విత్తు కవి మేథస్సు
అంకురించిన వృక్షాన్ని పెంచి పెద్ద చేస్తాడు
శాఖోపశాఖలుగా విస్తరిస్తాడు... ప్రపంచమంతా మొలకెత్తుతాడు!
తన కలమనే కత్తితో కలుపు మొక్కల్ని నరుకుతాడు
సమాజంలో ఊపిరి పోసుకుంటున్న చెడుని తెలుసుకోమని
తన ఆక్షరావేశంతో ప్రపంచమంతా గొంతెత్తి చాటుతాడు !
స్పందించే మనస్సుతో కలం పట్టి, గళం విప్పి
అక్షరాలతో సమాజ సేద్యం స్వేచ్ఛగా చెయ్యగలడు కవి!
ఆస్వాదించడానికి ప్రకృతి ఇచ్చే పచ్చదనం.. బాటసారులకి
శ్రమ తెలియ నివ్వని నీడ.. పక్షి సంతానం పెరగడానికి..
పెద్ద వృక్షాల అవసరం తెలుసుకున్నారు పూర్వ పాలకులు!
విత్తునాటి అంకురించిన మొలకల్ని పెంచి పెద్దచేసి
అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మల్ని కొడవలితో నరికేసి
మొక్కల్ని, వృక్షాలుగా ... వృక్షాల్ని, మహావృక్షాలుగా మార్చేసి
రహదారులకు ఇరువపులా భావితరాలకు అందించారు!
శాఖోపశాఖలతో విస్తరించి ఒకదానితో ఒకటి పెనవేసుకుని
ఊగిసలాడే ఊడలతో  పలకరిస్తూ.. పాలకుల చరిత్రని తెలుపుతూ
కపి సమూహాల్ని ఆడిస్తూ.. బాటసారులకి గొడుగు పడుతున్నాయి!
కర్కశమైన హృదయాలతో .. మూలాల్ని కొడవళ్లతో నరికేసి
రహదారులు విస్తరిస్తూ.. అటవీ ప్రాంతాలు వెలికి వస్తే ..
మృగాలన్నీ తలదాచుకునే చోటు లేక..అంతరించి పోతున్నాయి!
ఈనాటి పాలకుల గురించి చెప్పేదెలాగని వాపోతుంటే
కవిలోకంలో అంకురించి..తన రచనలతో హుంకరించి.. కవిలోకం,
పాఠకలోకాల్లో విస్తరించి.. కవితలకి ఏదీ కాదు అనర్హమని చెప్పిన

విస్తరించిన మహా కవివృక్షం.. ’శ్రీశ్రీ’  గుర్తుకొచ్చాడు !!

No comments:

Post a Comment