31. భూగోళం తన రూపమంది..
అణువణువుకి శక్తంది..
మనుగడకే ముప్పంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
32. శరీరమే వజ్రాల కుప్పంది..
కుప్పలో రేణువు చాలంది..
రాల్చానంటే
తిప్పలంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
33. ఆరడుగుల్లో ఉండమంది..
ఆరోగ్యసూత్రం మంచిదంది..
అదే ఆరోగ్య భాగ్యమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
34. దేశాలన్నీ తనవంది..
ఒక దేశంతో పనిలేదంది..
మతభేదాలు వద్దంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
35. వాహనమవసరం లేదంది..
శిక్షకి కోర్టులెందుకంది..
తీర్పులకి తనే జడ్జంది...
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment