దుర్మిఖీ! నీకు ఇదే మా స్వాగతం!
నూతన సంవత్సరమా! వసంతమాసాన్ని వెంట తీసుకుని
ప్రతి సంవత్సరం ఏదో ఒక పేరుతో వస్తూనే ఉన్నావు...
మాలో కొత్త ఆశలు చిగురింపచేస్తావు...! మామిడి చిగురులా
ఆశలు అందంగానే ఉన్నా.. రుచికి మాత్రం వేప చిగురులా చేదే సుమా!
దుర్ముఖీ! నువ్వు ఎలా ఉంటావో...మాకోసం ఏం తెస్తున్నావో?
ఊహించే ధైర్యం మాకు లేదు... నువ్వు మా ఊహకెప్పుడూ అందవు!
*మేము ఊహించేది
ఒకటి...నువ్వు మాకు పంచేది మరొకటి!
మాకు తెలుసులే! నువ్వు చాలా మంచిదానివి..వట్టి చేతులతో మాత్రం రావు!
తెలుగువారి తొలి పండుగగా అడుగుపెట్టి, ఆరు రుచుల ఉగాది పచ్చడితో
పోలుస్తావు... జీవితమంటే సుఖదు:ఖాల కలయికే నంటావు...!
పాడిపంటలే సిరిసంపదలని, పశువుల్ని ఆదరించడం భూతదయని,
వసంత మాధవ పూజలు, వసంతోత్సవం, వసంత నవరాత్రులంటూ
మామిడి చిగుళ్ళు, వేపపూత, కోయిల కూతల మేలుకొలుపులతో...
వసంతమాసంలో అడుగుపెట్టి ప్రకృతిని
పరవశింప చేస్తావు!
చలివేంద్రాల ఏర్పాటు, చెప్పులు, గొడుగుల దానం, అన్నదానాలతో..
సూర్యతాపాన్ని తగ్గిస్తూ బాటసారుల్ని ఆదరించమంటావు!
పండుగ రోజు బంధుమిత్రులందరు కలిసి గడపాలంటూ..
ఉన్నవాళ్ళు, లేనివాళ్ళని ఆదుకోడం...
ఆచారమంటూ...
ఇదే పుణ్యకార్యమని భావితరాలకి చాటి చెప్తావు...!
’ఉగాది’ మొదటి పండుగంటూ...భాష
సంస్కృతుల్ని గుర్తు చేస్తావు,
ఆరునెలలు దీక్షలతో... ఆరునెలలు పండుగలతో...
తెలుగు జాతికి...సంస్కృతిని, సంప్రదాయాన్ని నేర్పివెడతావు!
కొత్త సంవత్సరాన్ని! మళ్ళీ వచ్చానంటూ
వస్తూనే ఉంటావు...
పంచాంగ శ్రవణంతో ఆశలు చిగురింపచేస్తావు...మనసులు రంజింపచేస్తావు!
పేరు మార్చినట్టే రూపు మారుస్తావు... ఎప్పుడూ ఉల్లసంగా ఉత్సాహంగా ఉంటావు...
ఎన్ని సంవత్సరాలు పెరిగినా ముదిమి నిన్ను చేరదు...!
కవులందరం కలిసి నిండు మనస్సుతో నిన్ను స్వాగతిస్తున్నాము!!
భమిడిపాటి బాలాత్రిపురసుందరి
సెల్ నం. 9440174797
This comment has been removed by a blog administrator.
ReplyDelete