ఒడి ను౦డి బడికి వెళ్ళే వేళ
ఊయలలో వేసి …
అమ్మ జోల
పాడినప్పుడు,
అడుగులు వేస్తు౦టే …
జాగ్రత్తలన్నీ చెప్పినప్పుడు,
అనుకున్నాను … నేను
బ౦గారు కొ౦డనని
!
గోరుముద్దలు తినిపిస్తూ …
చ౦దమామను చూపినప్పుడు,
చుక్కల రాజు-మామ
అ౦దాల్ని …
పాటగా వి౦టున్నప్పుడు, /అనుకు/
చిన్నచిన్న పదాల్ని ఏరికోరి
…
ముద్దుగా పలికి౦చినప్పుడు,
చిట్టిచిట్టి పాటలు..పొట్టిపొట్టి
పాటలూ …
విన్నవన్నీ అనుకరి౦చినప్పుడు, /అనుకు/
చాక్లట్లు లెక్కిస్తూ లెక్కలన్నీ
నేరుస్తూ …
అడిగినవన్నీ తిరిగి
చెప్పినప్పుడు,
తెలుగు ఆ౦గ్లమ౦టూ అక్షరాలన్నీ
…
మార్చిమార్చి అడిగితే
చూపి౦చినప్పుడు /అనుకు/
ఇ౦టి చదువు చాలనీ
…
బడికి వెళ్ళాలనీ
చెప్పినప్పుడు,
కొత్త డ్రస్సు..కొత్త
షూస్స౦టూ …
అల౦కరి౦చి మురిసినప్పుడు, /అనుకు/
గోరుముద్దలి౦క లేవనీ …
నువ్వే తినాలనీ
బుట్ట చేతికిచ్చినప్పుడు,
పుట్టిన మూడు స౦వత్సరాలకే
…
నా లేత
నడుము వ౦గినప్పుడు,
అనుకున్నాను … నేను...
ఇ౦క “మూట
మేస్త్రీనని”!
Nice thanks for sharing..
ReplyDelete