నాన్నమ్మ చెప్పిన చెట్టుతల్లి కథ
ఒక చిన్న
గ్రామంలో శ్రీను అనే ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. శ్రీనుకి తల్లితండ్రులుగాని,
బంధువులుగాని లేరు. ఒక్కడే ఒక చెట్టుకింద బతికేవాడు.
అప్పుడప్పుడు
తినడానికి ఏదీ దొరికేది కాదు. అప్పుడు ఆ చెట్టే శ్రీనుకి తినడానికి తియ్యటి పళ్లు
ఇచ్చేది. ఏడవద్దని చెప్తూ చల్లటి గాలిని పంపించి నిద్రపుచ్చేది.
వర్షం
పడితే ఎక్కడికీ పనికి వెళ్లడానికి లేక ఆ చెట్టుకిందే ఉండిపోయేవాడు. వర్షం శ్రీను
మీద పడకుండా ఆ చెట్టే చూసుకునేది. ఆ చెట్టే శ్రీనుకి ఇల్లన్నమాట!
అవసరమైనవన్నీ ఇస్తున్న ఆ చెట్టంటే శ్రీనుకి అమ్మ మీద ఉన్నంత ప్రేమ ఉండేది.
తనకి ఏ కష్టమొచ్చినా దానికే చెప్పుకునేవాడు.
శ్రీను అ
చెట్టు కిందే పెరిగిపెద్దవాడయ్యాడు. ఇప్పుడు పళ్లు తిని బతకడం, చెట్తు కింద
నిద్రపొవడం బాగుండలేదనుకున్నాడు. తను మరీ సోమరిగా తయరవుతున్నాడు. ఎక్కువ మంది జనల
మధ్య ఉంటే బాగుంటుందనుకున్నాడు.
ఏదయినా
పని చేసుకుని బతుకుదామని నిర్ణయించుకున్నాడు. ఎఅయినా పని చేసుకుని బతికితే
బాగుంటుందని తనకున్న సామాను పట్టుకుని బయలుదేరాడు.
పనికోసం
వెతుక్కుంటూ వేరే గ్రామానికి వెళ్లాడు. అందర్నీ తనకి పని ఇప్పించమని అడుగుతూ
తిరిగాడు.
చివరికి
ఒక పని దొరికింది. అక్కడ శ్రీనుకి చాలమందితో పరిచయం ఏర్పడింది. అందరూ శ్రీనుతో
స్నేహంగా ఉంటున్నారు.
శ్రీను
చెట్టు సంగతే మర్చిపోయాడు. ఇప్పుడు తను చేస్తున్న పని తనకి ఎంతో సంతృప్తిని
ఇస్తోంది. స్నేహితులతో కలిసి పనిచేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు.
శ్రీను
పని చేసే చోట పెద్ద పెద్ద చెట్లు నరికి, ఆ కలప తెచ్చి పడేస్తుండేవాళ్లు. వాటిని
పద్ధతిలో నరికి అమ్ముతుండేవాళ్లు. కొంత కలపని వేరే ప్రదేశాలకి పంపిస్తూ
ఉండేవాళ్లు.
ఒకరోజు
అక్కడికి వచ్చిన కలపలో తనను పెంచిన చెట్టు కూడా ఉండడం గుర్తించాడు. తన చిన్ననాటి
విషయాలన్నీ గుర్తొచ్చాయి.
ఆ
చెట్టెక్కి ఆడుకోవడం; దాని ఆకులు కోసి విస్తళ్లుగా కుట్టడం, దాని మీద వాలిన పక్షుల
కూతలన్నీ నేర్చుకుని వాటిని అనుకరించడం; చెట్టు మీదకి ఎక్కిన కోతుల్ని రాళ్లతో
కొడుతుంటే అవి తిరిగి తనని వెక్కిరించడం అన్నీ ఒక్కక్కటిగా గుర్తొస్తున్నాయి.
అంతేకాదు,
ఆ చెట్టు తనని తల్లిలా ఆదరించింది. నిద్రవచ్చినా, ఆకలేసిన వర్షమొచ్చినా, ఎండకాచినా
తనకు బాధ కలగకుండా ఆదరించింది. ఎన్నో విధాలుగా తల్లి లేని తనని తల్లిలా కాపాడింది.
ఆ చెట్టుని
నరికేశారని శ్రీను చాలా బాధపడ్డాడు. తన చెట్టుతల్లికి అన్యాయం జరిగినందుకు
దుఃఖపడ్డాడు. చెట్లు మనుషులకి ఎన్ని విధాలుగా రక్షణ కలిగిస్తాయో అనుభవంతో పూర్తిగా
తెలిసినా చెట్లు నరకడాన్ని తను కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపించింది.
వెంటనే
అక్కడ పని చెయ్యడం మానేశాడు. స్నేహితులు ఎని విధాలుగా చెప్పినా వినలేదు. అప్పటి నుంచి
అక్కడే కాదు, చెట్లు నరికేచోట, కలప ఎగుమతి చేసేచోట పనిచెయ్యడం మానేశాడు” అని నాన్నమ్మ కథ పూర్తి చేసింది.
“అన్నట్టు
మర్చిపోయనురా! మీరు మొక్కలు నాటారు కదా? వాటికి నీళ్లు పోస్తున్నారా.. లేదా?
భడవల్లారా! వాటిని ఎక్కడి నుంచో తెచ్చి, ఇక్కడ పాతిపెట్టి చంపేస్తారా?
ఎప్పుడూ
ఆటలాడుదామనే కాని ఒక్క మంచి పని కూడా చెయ్యరుకదా! మీరు మాత్రం ముప్పొద్దులా
తింటారు.. వాటికి నీళ్లు పొయ్యలేరు. అసలు ఒక పూట మీకు తిండి పెట్టకుండ ఉంటే
అప్పుడు తెలుస్తుంది ఆ మొక్కలు పడే బాధేంటో.
సరే! ఈ
రోజుకి వదిలేస్తున్నాను రేపట్నుంచి వాటికి నీళ్లు పొయ్యకపోతే మీ సంగతి చెప్తాను.
ఇంక పడుక్కోండి కథ కంచికి.. మనం రేపు తోట పనికి! అని చెప్పి నాన్నమ్మ నిద్ర
పోయింది.
పిల్లలందరూ ‘రేపు ఏమైనాసరే మనం
మొక్కలకి నీళ్లు పోసి, వాటి మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని పీకేసి శుభ్రం చెద్దాం!’ అని చెప్పుకుని నిద్రపోయారు.
No comments:
Post a Comment