కరోనా పాదాలు - బాలల పదాలు
21. పేరుతోనే ఝళిపించింది..
సంస్కారం ఇదని నేర్పింది..
దారి తప్పితే వదలనంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
కుటుంబమంతా ఒక్కటంది..
కలిసి ఉంటేనే సుఖమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
దూరం దూరం జరగమంది ..
నష్టం ఎవరికైనా
తప్పదంది..
ఆరోగ్య రహస్యం
చెప్పింది!
మూగారంటే ముప్పంది..
తాకడమసలే వద్దంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
దయాగుణం పెంచమంది..
అందరి మంచిని కోరమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment