About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వ్యాసము:సమీక్ష గోవిల్ (జెనెరివాల్) – ఉత్పత్తి ‘కాగ్జీ బాటిల్స్’

 

సమీక్ష గోవిల్ (జెనెరివాల్) ఉత్పత్తి కాగ్జీ బాటిల్స్

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించే దిశగా ప్రయాణం

     ప్లాస్టిక్ వినియోగం లేకుండా జీవించలేని పరిస్థితిలో మనిషి మనుగడ సాగుతోంది.. భూమి మీద రోజురోజుకు టన్నుల కొద్దీ ప్లాస్టిక్పేరుకుపోయి పర్యావరణానికి, భూమి మీద, నీటిలోను జీవిస్తున్న జీవులకి తీవ్ర నష్టం కలుగుతోంది. 
   2019 నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 3.3 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.  ప్లాస్టిక్వ్యర్థాల వల్ల కలిగే నష్టం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. 
    సమీక్ష గోవిల్ ప్లాస్టిక్ నిర్మూలనకి తన వంతుగా ఏదైనా చెయ్యాలని ఆలోచించారు. అప్పటికే చాలా కంపెనీలు  ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడానికి, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఇతర ఉత్పత్తుల్ని అందించడానికి ముందుకొచ్చాయి.
   ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో,  ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నపట్టుదలతో పని చేస్తున్న సమీక్ష గోవిల్ వంద శాతం బయోడిగ్రేడబుల్ పేపర్ బాటిల్ను తయారు చేసారు.  పర్యావరణం మీద ఎటువంటి హానికరమైన ప్రభావాన్నీ చూపించని ఈ బాటిల్ ప్రపంచంలోనే మొదటిది.  

   కంపోస్టబుల్ కాగితపు వ్యర్థాలతో పేపర్ బాటిల్ తయారీకి హైదరాబాదులో కాగ్జీ బాటిల్స్ అనే పేరుతో మొదట ఒక కంపెనీ స్థాపించ బడింది. ప్లాస్టిక్ బాటిల్స్ కు ప్రత్యామ్నాయంగా పేపర్ బాటిల్స్ తయారు చేసి అభివృద్ధి చేసిన  కాగ్జీ బాటిల్స్ కంపెనీ వ్యవస్థాపకురాలే ఇప్పటి మన సమీక్ష గోవిల్ . బాటిల్స్ షాంపూలు, కండిషనర్లు, హ్యాండ్ వాష్లు మొదలైనవి నిలువ చేయడానికి ఉపయోగపడ్డాయి.

ఈ ఆలోచన ఎందుకు వచ్చింది - సమీక్ష గోవిల్ మాటల్లో...
మహిళలు మంచి నిర్ణయాల్ని తీసుకోగలరు,  సృజనాత్మకంగా ఆలోచించగలరు. సమస్యలు ఎన్ని ఉన్నావాటిని అధిగమిస్తూ అభివృద్ధి పథంవైపు పయనించగలరు. అభివృద్ధి దిశగా నడుస్తున్న ఎన్నోకంపెనీలను మహిళలు ప్రారంభించి గొప్ప పేరు తెచ్చుకోడానికి ఇవే ముఖ్య కారణాలు.
  నేను ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ వెంచర్ లో పని చేస్తున్న సమయంలో ఒక క్లయింట్ అన్నిఅవసరాలకు ఉపయోగపడే ప్యాకేజింగ్ ఉత్పత్తులు కావాలని అడిగారు. నేను కాలేజీలో చదివే రోజుల్లో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పనిచేసే బాటిల్ తయారీ కంపెనీని ప్రారంభించాలని అనుకున్నాను. 
   పనుల ఒత్తిడిలో ఉన్న నేను ఆ విషయం గురించి మళ్లీ ఆలోచించలేదు. ఆనాటి నా ఆలోచన క్లయింట్ కోరడం వల్ల మళ్లీ మొదలైంది. అనుకున్న విధంగా ఉత్పత్తిని ప్రారంభించడం మీద పూర్తిగా దృష్టి సారించాను” అన్నారు కాగ్జి బాటిల్స్ వ్యస్థాపకురాలు సమీక్ష గోవిల్.  
తయారీకి ఉపయోగించే వస్తువుల గురించి - సమీక్ష గోవిల్ మాటల్లో...
   వినియోగపరచడానికి వీలుగా ఉండేవి, కంపోస్ట్ చేయగలిగినవి, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు అన్ని రూపాల్లో తయారు చెయ్యగలిగాము. ప్యాకేజింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్ని పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యతిరేక సెంటిమెంట్ పెంచింది. 
    మార్పులో బయోప్లాస్టిక్తో పాటు పేపర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బయోప్లాస్టిక్ అనేది కొత్త అంశం కాబట్టి, ప్రజలు దాని బయోడిగ్రేడబిలిటీ గురించి అయోమయంలో ఉన్నారు. 
   ఇది ప్యాకేజింగ్లో కాగితాన్నే తరువాత ఉత్తమ ఎంపికగా మార్చింది. దీన్లో అన్ని రకాల లేబుల్స్ ని అందంగా ప్రింట్ చెయ్యగలగడం, తేలికగా కంపోస్ట్ చెయ్యబడడం వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాగితం కోసం ఉపయోగించే చెక్కని అడవుల నుంచి, ఇతర వ్యర్థాల నుంచి తీసుకుంటారు. దీన్ని రీసైకిల్ చేయడం సులభం, సహజమైన రూపంతోనే ఉంటుంది తాము ఉపయోగిస్తున్న ముడిసరుకు గురించి తమ సంతృప్తిని వెల్లడించారు. 
తయారు చేసే విధానం - తెలియచేస్తున్న సమీక్ష గోవిల్:
   కాగ్జీ బాటిల్స్ వంద శాతం మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారిపోతాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి సేకరించిన కాగితపు వ్యర్థాలతో తయారు చెయ్యబడతాయి.  కాగితాన్ని నీరు, ఇతర రసాయనాలను కలిపి గుజ్జుగా తయారు చేస్తారు.  గుజ్జును ఒక బాటిల్ యొక్క రెండు భాగాలుగా వివిధ ఆకారాలలో తయారు చేస్తారు. 
   తరువాత  రెండు భాగాలు నీటి నిరోధక ద్రావణం ఉపయోగించి జోడించి ఒక బాటిల్ గా తయారు చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్ లాంటి పేపర్ బాటిల్ తయారు చేయడానికి 2 రోజులు పడుతుంది. ఏదైనా ద్రవాన్నిగాని పొడినిగాని అందులో నిలవ చేయవచ్చు. ఒక బాటిల్ ధర  సుమారు 19-22 రూపాయల వరకు ఉంటుందని తమ కృషి గురించి తెలియచేసారు.
మొదటిసారి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించిన విధానం - సమీక్ష గోవిల్ మాటల్లో   
   ఎలా ప్రారంభించారో చెప్తూ కాగ్జీ బాటిల్స్కంపెనీలో, మేము కాగితంతో తయారు చేసిన బాటిల్స్ ను తయారు చెయ్యడానికి కృషి చేస్తున్నాము. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో మాకు సహాయపడే ఒక వినూత్న ప్యాకేజింగ్ టెక్నాలజీని, మార్కెట్లో స్థిరంగా నిలబడ గలిగేలా మన్నిక ఎక్కువ కలిగిన ఉత్పత్తి కోసం ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాము. 
   ఇక్కడి వరకు మా  ప్రయాణం అద్భుతంగా సాగింది. మేము నూరు శాతం బయోడిగ్రేడబుల్ గాను, దీర్ఘకాలం ఉండేవిగానూ తయారు చెయ్యడానికి చేసిన కృషి ఫలించింది. ఇది దాదాపు 5 సంవత్సరాల పరిశోధన. మొదటిసారిగా మేము దాన్ని మార్కెట్టులో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నించాము. 
   స్ట్రాస్, పేపర్ పౌచ్లు, ట్యూబ్లు మొదలైన ప్లాస్టిక్కు ఇతర ప్రత్యామ్నాయ పరిష్కారాల మీద కూడా పని ప్రారంభించి అనుకున్న సమయానికే మా ఉత్పత్తుల్ని మార్కెట్లోకి విడుదల చేశాము.
    మా ప్రయత్నాలు ఫలితాల్ని సాధించడానికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2021లో రిజిష్టర్ చేశాము. అప్పటికే ప్రముఖ పర్సనల్ కేర్ బ్రాండ్తో ట్రయల్ టెస్ట్‌లు నిర్వహించడం పూర్తయింది. జీడిమెట్లలో అసెంబ్లీ యూనిట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఉత్పత్తి బాగా పెరిగిన తరువాత ఎక్కువ సదుపాయాల్ని సమకూర్చుకోవాలని ఆలోచించాము” అని వివరించింది.
అనుకున్నది సాధించారు.. దేశ ఔన్నత్యాన్ని పెంచారు సమీక్ష గోవిల్
   తన కలను నిజం చేసుకోవడానికి,  చాలా మంది శాస్త్రవేత్తలు, ఉత్పత్తి డిజైనర్ల  సహాయం తీసుకున్నారు. ఖాళీ బాటిల్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమైన సవాలు. సమీక్ష ముందుగా బ్రౌన్ కలర్ పేపర్ బాటిల్ ను తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, బంధువులకు అలవాటు చేశారు. 
   ప్రజలు పారదర్శకమైన బాటిళ్లను చూడటం అలవాటు చేసుకున్నారు, అయితే ప్లాస్టిక్ను తొలగించాల్సిన అవసరం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ద్వారా పేపర్ బాటిల్స్ ఉత్పత్తి, వినియోగం పెరిగిందని సమీక్ష గోవిల్ నమ్మకం.
   సమీక్ష స్థాపించిన కాగ్జీ బాటిల్స్కంపెనీలో ఉన్న బ్రౌన్ బయోడిగ్రేడబుల్ బాటిల్ భారతదేశంలో మొదట తయారు చేయబడింది. దీనికి దేశీయ నామం పెట్టాలని అనుకున్నారు.  బాటిల్ పేపర్తో తయారు చేయబడింది, కాబట్టి సమీక్ష కంపెనీకి పేపర్ బాటిల్ అని పేరు పెట్టారు. 
   కాగ్జీ బాటిల్స్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి వంద శాతం బయోడిగ్రేడబుల్ బాటిల్స్ను అందిస్తోంది.
ఉత్పత్తిలో అభివృద్ధి గురించి తన ఆలోచన - పంచుకున్న సమీక్షగోవిల్ 
   ప్రస్తుతం, మా ఉత్పత్తి బాహ్యంగా ఉపయోగించే ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది, మేము ఆహార ఉత్పత్తుల కోసం ఉపయోగించగల ప్యాకేజింగ్ను అభివృద్ధి చెయ్యడం గురించి ఆలోచిస్తున్నాము. ప్లాస్టిక్ కంటైనర్లు లేదా ప్యాకెట్లలో ప్యాక్ చేసే పాలు, పెరుగు, ఇతర ఆహార పదార్థాలను  బాటిల్స్ భర్తీ చేస్తాయి. వాటిని కూడా ఉత్పత్తి చెయ్యగలమని పూర్తి భరోసా ఉంది. ఇందుకు అకౌంట్లు, మార్కెటింగ్ చెయ్యడం వంటి విషయాల్లో WE HUB ద్వారాపొందిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వ్యాపారంలో అభివృద్ధికి WE HUB సహకారం ఎంతో ప్రశంసనీయం” అని హైదరాబాద్లో పుట్టి పెరిగి, విజ్ఞాన్ జ్యోతి ఇనిస్టిట్యూట్లో ఎంబీఏ పూర్తి చేసిన సమీక్ష గోవిల్ చెప్పారు. 
ప్లాస్టిక్ పూర్తి నిర్మూలనే ధ్యేయం - వివరిస్తున్న సమీక్ష గోవిల్
   ఈ ప్రయాణం ఎలా సాగిందో సమీక్ష గోవిల్ మాటల్లో తెలుసుకుందాం. నేను మొదట ప్రారంభించినప్పుడు, ప్లాస్టిక్ నుంచి లిక్విడ్ ప్యాకేజింగ్లో ఇంకా మంచి మర్పు తీసుకురావాలనే ఆలోచన ఉండేది.చెత్తకు సంబంధించిన వివిధ చిత్రాలను చూస్తే, పర్యావరణానికి సంబంధించిన ప్రధాన సమస్య ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్యాకెట్లు అని అర్థమైంది. ప్లాస్టిక్ బ్యాగ్లకు బదులుగా పేపర్ బ్యాగులు, గుడ్డ సంచులు వంటివి మా దగ్గర ఉన్నాయి. 
   కాని బాటిల్ ఉపయోగం మార్కెట్లో ఎక్కువగా ఉంది. నేను షాంపూలు, కండిషనర్ల ప్యాకేజింగ్ మీద నా పరిశోధన ప్రారంభించాను. వేస్ట్ పేపర్ నా మొదటి ఎంపిక. 
   నేను కాగితం జలనిరోధిత తయారీ మీద నా పరిశోధనను ప్రారంభించాను. ప్రకృతిలో గడ్డి, ఆకులు, బెరడు, తామర ఆకు, అరటి ఆకు మొదలైనవన్నీ  లనిరోధితమైనవే అని గమనించాను,  మనం మన దైనందిన జీవితంలో అలాంటి వాటి నుండి ప్రేరణ పొంది దాని నుంచి జీవితంలో ఉపయోగపడే ఉత్పత్తిని ఎందుకు తయారు చేయలేము? అన్న ఆలోచన వచ్చింది. గుడ్డుట్రేలను బేస్గా ఉపయోగించి, బాటిల్ను రూపొందించడానికి, కాగ్జీ బాటిల్స్ను ప్రారంభించే ముందు కూడా నేను రెండు సంవత్సరాలు నా పరిశోధనని కొనసాగించాను అని సంతోషంగా వివరించారు.
   ఆమె ప్రయాణం పేపర్ బాటిళ్లను తయారు చేయడం ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని వదిలించుకోవడానికి ప్రపంచానికి మార్గాన్ని చూపించారు.  సమీక్ష తాను కాలేజీ రోజుల నుంచి ప్లాస్టిక్ బ్యాగ్స్ను రీప్లేస్ చేసే ప్రాజెక్ట్‌ కాగ్జీ బాటిల్స్ మీద సీరియస్గా వర్క్ చేస్తున్నానని సర్వే వెల్లడించింది అని చెప్పారు. తన దైనందిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తగ్గించాలని చేసిన ప్రయత్నంలో ఇంతకంటే మరో మంచి మార్గం ఎక్కడుంది! అని తన సంతృప్తిని పంచుకున్నారు సమీక్ష గోవిల్.
   సహకారాన్ని అందించే భర్త, చలాకీగా ఉండే ఇద్దరు పిల్లలతో సమీక్ష గోవిల్ పారిశ్రామిక రంగంలో ముందుకు దూసుకు వెడుతున్నారు. 
   ఆమెతో కలిసి పనిచేస్తున్న ఆమె బృందం నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. సమీక్ష గోవిల్  కలలు సంపూర్ణంగా ఫలించి, కాగ్జీ బాటిల్స్ కంపెనీ అభివృద్ధి పథంలో ప్రయాణించాలని ఆశిద్దాం!! 

 

No comments:

Post a Comment