కరోనా పాదాలు-బాలల పదాలు
40. బాలల్లారా! రారండి!..
కరోనా కథనం విపిపిస్తా ..
గుర్తించడమెలాగో చెప్పింది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
41. అదృశ్య శక్తిని నేనంది..
దగ్గు తుమ్ము సంకేతమంది..
చేతులు సబ్బుతో కడుగంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
42. వాహనం వద్దని వెళ్లింది..
దేశ రాజధానిలో చేరింది..
కాలుష్యం తగ్గించి వచ్చింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
43. ఏడుకొండలు ఎక్కింది..
భక్తుల పరుగులు ఆపింది..
వెంకన్నకి విశ్రాంతి నిచ్చింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది
44. కుటుంబ సభ్యుల్ని కలిపింది..
ఒకచోట చేర్చి చెప్పింది..
కలిసి ఉంటేనే సుఖమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది
45. మందు తాగద్దని చెప్పింది..
తాగుడు కోరిక వద్దంది..
బతకనివ్వనని తేల్చింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment