సాహితీరస స్రవంతి జూమ్ కవిసమ్మేళనంలో 20-9-2023 చదివిన కవిత
ఊపిరి నియంత్రించగలగడం.. ఆధ్యాత్మిక జీవనం !!
ఊపిరి పోసుకోడం.. జననం
ఊపిరి అగిపోడం.. మరణం
ఆగి, కొద్దిసేపు ఊపిరి
పీల్చుకో! స్థిమితపడు!
ఆందోళనపడేవారికి సలహా
ఇస్తాం!
‘ఊపిరి సలపనంత పని!’
అంటూ
హైరానా పడిపోతూ ఉంటాం!
నిజం చెప్పాలంటే... ‘ఊపిరి’ అనే మాట
మాటలకే పరిమితం!
మన ప్రమేయం లేకుండా
జరిగిపోయే ప్రక్రియ
ప్రతి ఒక్కరం ఊపిరి పీల్చుకుంటున్నాం.
ఇది సహజసిద్ధ చర్య!
నడిచేవాళ్లం, పరిగెత్తితే
ఊపిరి కోసం వగరుస్తాం!
గబగబా మెట్లు ఎక్కవలసివస్తే, అలసట
ఉక్కిరిబిక్కిరి.. వేగంగా పీల్చుకుంటాం ఊపిరి!
ఊపిరి అందనప్పుడు తప్ప,
ఊపిరి మీద ఉండదు ధ్యాస!
ఊపిరి ఆగిపోతే..
ప్రాణం పోయిందని
అర్థం.. అదే మరణం
ఊపిరి ఆగిపోతే... జీవి ప్రయాణం ముగిసినట్టే
వేదాంతం, మహర్షులు, సద్గురువులు..
గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు..
చెప్పేది ఒకటే మాట!
ఊపిరి ఉన్నంతవరకే ఏదైనా
ఊపిరి ఆగిందంటే కనిపించేదంతా
కనుమరుగవుతుందని!
పూజలు, జపాలు, తీర్థయాత్రలు కాదు..
మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవాలి
దాన్నే అనుసరించారు మహర్షులు
ఊపిరి ఆపారు.. ఆయుష్షు పెంచారు
అదే ప్రాణాయమం.
ప్రాణం ఉంటుంది ప్రకృతిలో.. పంచభూతాల్లో
పంచభూతాల ద్వారా ఏర్పడుతుంది ప్రాణం
మరణం తరువాత కలిసిపోతుంది ప్రాణం పంచభూతాల్లో..
మనిషి అంటే శరీరం కాదు, ప్రాణం
సాధనతో మనిషి ఆపగలడు మరణం..
పొందగలడు తను కోరుకున్నప్పుడు
ఊపిరిని తన స్వాధీనంలో ఉంచి!
శ్వాస ఆగిపోవడం.. పరిస్థితులకు
స్పందించకపోవడం..
మెదడులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడం..
ఇదే ఊపిరి ఆగిపోవడం!
మనిషి తపోబలంతో..
ఊపిరి ఆపగలడు.. తిరిగి పొందగలడు..
సాధ్యపడుతుంది.. నిరంతర సాధనతో
ఊపిరి నియంత్రించగలగడం.. ఆధ్యాత్మిక
జీవనం !!
No comments:
Post a Comment