ఆంశం: జీవనరాగం –
శీర్షిక : గతి తప్పిన శృతిలయలు
జరగాలి విశ్వామిత్రుడికి తపోభంగం!
విశ్వామిత్రుడు మనసు చలించింది..
మరలింది తాపసి తపసు మేనకవైపు !
విశ్వామిత్రుడుకి జరిగింది తపోభంగం
మహర్షి జీవనరాగంతో మేనక శృతి కలిపింది..!
మేనక వచ్చిన పని సఫలమైంది..
ఫలితంగా .. ఆడబిడ్డకు జన్మనిచ్చింది!
వెళ్ళిపోయింది ఇసుక దిబ్బ మీద విడిచి,
పక్షుల రక్షణలో బిడ్డను.. చూశాడు
కణ్వ మహర్షి.. దివ్యదృష్టితో తెలుసున్నాడు..
శకుంతలగా తన ఆశ్రమంలో పెంచి పెద్దచేశాడు
ఋషికన్యల అనురాగంతో చిగురించింది
శకుంతల.. జీవన పరిమళరాగం!
యజ్ఞయాగాలు, పక్షుల కిలకిలరావాలు
లేళ్లు, కుందేళ్ల పరుగులు, పుష్పించిన వృక్షాలు
ఆశ్రమంలో ప్రకృతి పరవశించింది.. జీవన రాగం..
శకుంతల శ్రుతిలయలతో గొంతు కలిపింది!
జింకను వేటాడుతూ దుష్యంతుడు..
కణ్వ మహర్షి ఆశ్రమం కనువిందుగా చూస్తూ..
శకుంతలను చూసి పొందిన మోహపరవశ్యం!
ఆతిథ్యం అందుకుని .. జీవిత భాగస్వామినిఎంచుకుని..
గాంధర్వ వివాహం మంచిది.. నువ్వే నా రాణివని..
ముద్దుమురిపాలతో అలరించి.. ప్రేమపాఠాలు నేర్పించి..
శృతిలయలు మేళవించి.. జీవనరాగాన్ని ఆలపించాడు!
రాచకార్యం గుర్తుకొచ్చి ..రాచ మర్యాదలతోఆహ్వానిస్తానని
చెప్పి వెళ్లాడు .. శకుంతల మగబిడ్డకు జన్మనిచ్చింది..
జీవరాగం శ్రుతి తప్పి.. జీవితగమ్యం మృగ్యమైంది!
కణ్వమహర్షి .. పుట్టిన బిడ్డ జాతకం చూసి..వెరుగుపడి
భారతావనికి చక్రవర్తి ఇతడు భరతుడన్నాడు..!
శకుంతలా భరతుల్ని దుష్యంతుడి దగ్గరకు చేర్చి..
గతి తప్పిన శ్రుతిలయల్ని ఏకంచేసి.. జీవనరాగం పలికించాడు!
.
No comments:
Post a Comment