అంశం:-స్మరణం
– శీర్షిక:- దైవనామస్మరణం
(సాహితీరసస్రవంతి గ్రూప్) 31-01-2024
భక్తితో భగవన్నామం జపించడమే దైవస్మరణం
ఆర్తిగా, ఆత్రంగా హృదయంతో చేసే స్మరణం
భవ రోగ దివ్య ఔషధం కలియుగానికి..!
“కేవలం కలౌ తు నామమాత్రేణ పూజ్యత్ భగవాన్ హరి:”
పరమాత్మను ఒప్పించడానికి, మెప్పించడానికి,
భగవంతుని అనుగ్రహానికీ, సులభమైన మార్గం,
మానవాళికి అందిన మహావరం నామస్మరణం!
ప్రదర్శనకు, ఆర్భాటానికి, స్థాయీస్థానాల
ప్రదర్శనలకు, అద్భుతాలు, మహిమలు, లీలలు,
అభూత శక్తుల విపరీత ధోరణులకు
కాకూడదు స్మరణం చిహ్నం!
మనోహరంగా మనోభావంగా సాగాలి స్మరణం
మనసులో మననం.. చెయ్యాలి హృదయస్తం...!
రూప నామ స్మరణం తేలిపోవాలి ధ్యానత్వంలో
లెక్కపెడుతూ జరిపే స్మరణం.. లెక్కల స్మరణం!
నామస్మరణతో రుక్మిణి త్రాసులో వేసింది తులసిదళం
కృష్ణుడి బరువు సరితూగింది. అమృతమై, అతిశయమై..
అలరారారే దైవనామ స్మరణం శక్తిని నిరూపించింది!
నిత్య దైవనామస్మరణం సంకీర్తనం...! పోతనామాత్యులు
భక్త తులసీదాసు, భక్తరామదాసు వంటి
భాగవతోత్తములు దైవ నామసంకీర్తనలో సేదతీరారు
సంత్ తుకారామ్, సతీ సక్కుబాయి
పాండురంగణ్ని ప్రసన్నం చేసుకున్నారు!
దైవబలం కావాలి. సర్వేశ్వరుడి సహకారం అందాలి.
అరిషడ్వర్గాల్ని జయించాలి.. అందుకు కావాలి
ఖడ్గం! అదే దైవ నామస్మరణం!
భగవన్నామంతో తీసుకోవాలి ఊపిరి
స్మరణంతో భగవంతుడ్ని చూడగలగాలి.!
సంసారసాగరాన్ని దాటించే నావ నామస్మరణం
భగవన్నామస్మరణ చేసే స్థలం పుణ్యక్షేత్రం
దైవనామ స్మరణం జరిగే ప్రతి గృహం ఒక పుణ్యతీర్థం!.

No comments:
Post a Comment