రంగనాథుడి కోవెల- గోదాదేవికి మమతల కోవెల
విష్ణువే
చిత్తములో గలవాడు.. శ్రీ
విష్ణుచిత్తుడు..
తులసీదళాలకు తోడు
ఒక పూవు దొరికిందనుకున్నాడు..
ముద్దుగా కోదై అని
పిలిచాడు.. ఆమే గోదా!
నేర్పాడు వైష్ణవ మతంలోని
ప్రేమతత్త్వ జ్ఞానాన్ని,,
13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించింది!
స్త్రీలు
చదువుకోరాదనే వాదనలు లేవనడానికి
12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం..
చదువు, జ్ఞానం
అందరిదీ అనడానికి.. చిరంజీవ సాక్ష్యం!
గోదా మమతల కోవెలలో శిల్పం
శ్రీరంగడు!
గోదాదేవి తన వలపు,
రంగడికి
పంపిన ప్రేమలేఖలు,
భావావేశ అనురాగ సందేశాలు,
ఆశలు,
ఆశయాలు,
అలకలు,
కోపాలు.
నాచ్చియార్ తిరుమోళి..
గోదాత్మను పరమాత్మతో అనుసంధించే
అద్భుత కావ్యం!
గోదా మమతల కోవెలలో కావ్య నాయకుడు
శ్రీరంగడు!
గోదా చిత్తంలో విష్ణువు,.
విష్ణువు
చిత్తంలో గోదా!
గ్రహించాడు విష్ణుచిత్తుడు ..పిలిచాడు
ఆండాళ్!
గోదా మమతల కోవెలలో మథురభావన
శ్రీరంగడు!
గోదా నెలరోజులు దీక్షవహించి..పాటించింది
శ్రీవ్రతం
ఆ నారాయణుడే సాధనకు లక్ష్యం..ఆయనే వ్రతం..
ఆయనే వ్రత విధానం,
ఆయనే వ్రత
సాధనం.!
ఆ నారాయణుడే సాధనకు లక్ష్యం..
ఇది మధురమైన భక్తి,
రసమయ భక్తి..
గోదాదేవి మమతల కోవెలలో పాశురాలే
శ్రీరంగడు!
జ్ఞాన బోధన చేసి వ్రత సాధన
చెప్పింది
వ్రతం పూర్తికాగానే ఫలం
సిద్ధించింది.
శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో
కన్పించాడు
రంగడు పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకు పంపాడు
గోదను తీసుకొని రమ్మని విష్ణుచిత్తులవారికి
చెప్పాడు
గోదను వివాహం చేసుకున్నాడు.. లీనమైంది రంగనాథునిలో
గోదాదేవి మమతల కోవెలలో ఒదిగిపోయాడు శీరంగనాథుడు!
మేడమ్ గారు
ReplyDeleteమీ రచనలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఋషుల గురించి వ్రాసిన పుస్తకం పిల్లలకు, పెద్దలకు ఒక కరదీపిక.
మీ చరవాణి సంఖ్య దయతో తెలుపగలరు.
ఇట్లు
డా. అల్లాడి సంధ్య
ఉప సంపాదకురాలు
సప్తగిరి, తిరుమల తిరుపతి దేవస్థానమల
ఆధ్యాత్మిక సచిత్ర మాసపత్రిక
తిరుపతి