అంశం:
ఊహించని మలుపులు
శీర్షిక: జీవిత మలుపులకు లేదు రాజు పేద
జీవితంలో మలుపులు ఊహకి అందవు
మలుపులు తప్పవు ధనికులకైనా.. పేదలకైనా
మహాభారతంలో ద్రోణుడు ఊహించాడా
తన స్నేహితుడే తనకు శత్రువవుతాడని!
భీష్ముడు ఊహించాడా తను పెంచిన మనుమల మధ్య
మహాభారతయుద్ధం జరుగుతుందని...
తన మనుమలే తనను నేలకూల్చుతారని!
తను ప్రేమించినవాడికి దూరమై
తీసుకొచ్చినవాడు పెళ్లి చెయ్యక వదిలేస్తే
సుకుమారమైన మనస్సు కలిగిన రాజకుమార్తె
అంబ.. పగతో ద్వేషంతో రగిలి, పగ తీర్చుకోడానికి
మరు జన్మలో మొదట ఆడపిల్లగా పుట్టి తరువాత
పురుషుడుగా మారి ఊహించని మలుపుల్లో
చిక్కుకోలేదా ..! అన్నీ తెలిసిన ధృతరాష్ట్రమహారాజు
కొడుకు వ్యామోహంలో పడి పాండవులకి ఒక్క ఊరు
కూడా ఇవ్వకుండా భూమండలం మొత్తం
కట్టబెట్టాలని ఊహించి..రాజ్యాన్ని పోగొట్టుకొని
అడవులపాలయ్యాడు కదా..
భూమండలమంతా ఏకంచేసి ఎన్నో ధనరాశులు
సంపాదించిన పాండురాజు ఊహించాడా.. అన్నింటినీ వదిలి
అడవుల్లో జీవించి వరపుత్రులైన పాండవుల్ని
అనాధలుగా చేసి మధ్యలోనే స్వర్గం చేరుకుంటానని
అర్జునుడు మహాభారత యుద్ధంలో శత్రువుల్ని ఓడించి
అన్న ధర్మరాజుని చక్రవర్తిని చెయ్యాలనుకుని...
భగవంతుడితో గీత చెప్పించుకుని లోకానికి
భగవద్గీతని అందచేస్తానని ఊహించాడా..
భగవంతుడు జీవితమిస్తాడు.. మనమే
అన్నీ చేస్తున్నామని గర్విస్తాము.. అంతలోనే
జీవితం ఊహకందని మలుపులు తిరుగుతుంది
భగవంతుడి దృష్టిలోధనికులైనా.. పేదలైనా
అందరూ సమానమే.. ప్రతి మలుపులోనూ
భగవంతుణ్ని స్మరిస్తూ.. గమ్యం చేరుకోడమే మన వంతు!

No comments:
Post a Comment