అంశం: మానసవీణ
పలకరించిన మానసవీణ – పులకరించిన మామిడిపండు
దేవర్షి నారదుడు బహుధన్యుడు.
చేస్తుందతడి మానసవీణ..
సదా హరిగుణ గానం!
మానసం వీణారాగం..
చేతి వీణ మ్రోగిస్తుంది ఆ రాగం
మానసవీణ కలిగిస్తుంది
నారదుడికి.. భక్తిపారవశ్యం
చేతివీణతో జగత్తుకి అందిస్తున్నాడు
ఆనంద పారవశ్యం!
సంకల్ప బలం
భగవన్నామ స్మరణలోనే..
లోకాల్ని సందేశంతో నింపుతోంది
నారదుడి మహతివీణ!
నారాయణ స్మరణతో మానసవీణ
శ్రుతి చేసుకుంటాడు..
ముకుంద గీతాలతో..
జగత్తుకి వీనులవిందు చేస్తాడు
మనస్సులో పరవశిస్తాడు..
జగత్తుని పరవశింపచేస్తాడు!
సుఖదుఃఖాలు రమ్మంటే రావు.
వద్దంటే పోవు..
నిరూపణ చెయ్యాలనుకున్నాడు
శ్రీకృష్ణుడు !
నారదుడితో బయలుదేరాడు
విహారయాత్రకు...
ఆపాడు అందమైన వనంలో
అందమైన సరస్సు వద్ద రథం...!
దాహంతో నీటిని దోసిలితో
తీసుకున్నాడు నారదుడు..
స్నానం చేయకుండా నీటిని త్రాగకు..
ప్రమాదమన్నాడు కృష్ణుడు!
వారిస్తున్నా వినలేదు.. దాహార్తి తీర్చుకున్నాడు...
తనను తాను మరిచాడు..
స్త్రీ రూపం పొందాడు నారదుడు!
శ్రీకృష్ణమాయా ప్రభావంతో
ఋషిపత్నిగా జీవించాడు
కలిగిన అరవైమంది సంతానం...
కళ్ళముందే విగతజీవులయ్యారు
స్ర్తి నారదుడు ఖిన్నుడయ్యాడు..
దుఃఖ భారంతో!
ఆకలి బాగా పెరిగింది..
మామిడి చెట్టుకి కనిపించిందొక పండు
భర్త ఋషి, అరవైమంది పిల్లల
శవాల్ని గుట్టగా పేర్చాడు.
ఆ శవాల గుట్టనెక్కి
పండును అందుకున్నాడు..!
తినబోతున్న స్త్రీ రూప నారదుణ్ని
బ్రాహ్మణుడు అడ్డగించాడు
స్నానం చేసి పండు తిను..
మృతులకు మంచిదన్నాడు!
మామిడి పండు ఉన్న చేతిని
పైకెత్తి పట్టుకుని
నారదుడు కొలనులో దిగాడు ..
పురుషుడిగా మారాడు ..
మారని మామిడిపండు హస్తం..
నారదుణ్ని వెక్కిరించింది!
కృష్ణుడు నవ్వాడు.. నారదుడు
పండుతో సహా నీటిలో మునిగాడు..
పైకి వచ్చిన నారదుడి చేతిలో
మామిడిపండు ‘వీణగా’ మారింది..
నారదుడి వీణ పేరు మహతి!
చెప్పాడు శ్రీకృష్ణుడు!
మహతిని చేతితో మీటాడు..
నారదుడి మానసవీణ పులకరించింది
నారాయణ! నారాయణ! స్మరణ గానంతో..
జగత్తు పరవశించింది!
No comments:
Post a Comment