ఉగాది కవిత-
“విజయీభవ ! దిగ్విజయీభవ !”
కొత్త పేరుతో
మళ్ళీ వచ్చేసింది కొత్త సంవత్సరం
ఉగాది వస్తూనే
ఉంది-సంపదలిస్తూనే ఉంది
ఇంటికి జ్యేష్ఠ - పొరుక్కి సింహరక్ష !
అన్నట్టు
పొరుగుదేశపు
బ్యాంకులు నింపుతూనే ఉంది
ఇందిరమ్మ పాట !
సోనియా బిక్ష! రాజీవ్ రక్ష !
మనిషికొక ఇల్లు,
ఇంటికొక దీపం,వితంతువులకు,
వికలాంగులకు,
వృద్ధులకు నెల నెలా పింఛను!
అందరికీ ఆరోగ్యం,
యువతకి ఉద్యోగం...
బాలలకు ఉచితంగా
చదువు, భోజనం!
ఫీజు ముందు
కట్టు! తర్వాత ఇస్తే తీసుకో !
అందిస్తున్నది పేదలకే ! అంటున్నది మాత్రం నిజం
అందుకుంటున్న
వారిలో అర్హులెంతమందో...?
సొమ్మొకడిది
సోకొకడిది...!
మధ్యతరగతి వెన్ను
గట్టిదే ! మొయ్యగలదు పన్నుభారం
కొత్త
సంవత్సరంలో జరగబోయేది అంతా మంచే
సోమరిపోతులదే
రాజ్యం...గాలిజనాలకి భోజ్యం...
రాజకీయనేతలకు
లేదు అవమాన భారం...
ఊచల మాటున కూడా అంతా
రాజపూజ్యం !
విజయ వచ్చి
ఎవర్ని వరిస్తుందో...వెతికి వేస్తుంది
పతనాల కుచ్చుల
మెడకి – సంకెళ్ళ ఉచ్చు!!
అంగారక గ్రహంపై జీవం ఉందా..? అక్కడ నీరు దొరుకుతుందా..? more updates
ReplyDelete