ఈ వసంతం ఈసారి మాకే సొంతం!! (ఇది బాలల కవిత
ఆకాశవాణి )
ఇదిగో వచ్చేసింది మన్మథ నామ వర్షం!
వసంతమాసంతో గుసగుసలాడుతూ ....
వస్తూనే అంటోంది ఉల్లాసం నాకే సొంతం!
మావి చిగుళ్ళు తిని కోయిలమ్మ కూసింది
కూత వినగానే మామిడి చెట్టు విరగబూసింది
స్వార్ధం లేనిది, అందరి మంచినీ కోరేది ప్రకృతి!
కోయిలమ్మ పాట, మావిడిచెట్టు పూత, వేసవి సెలవుల రాక..
ఉగాది పచ్చడి, కొత్తబట్టలతో మనసంతా ఆహ్లాదాన్ని
నింపింది!
అందరూ అన్నీ దోచేసినా...ఆశలన్నీ ఎండిన ఆకుల్లా
రాలిపోయినా
మళ్ళీ చిగురించి
అందరికీ ఆనందాన్ని పంచుతున్న
స్వార్ధం తెలియని ఈ వసంతం ఈ సారి మాకే సొంతం!!
మామిడి చెట్టుకి ఆకులు చిగురించినట్టే
మా మనస్సు నిండా మధురమైన ఆశల చిగురింత
ఆశిస్తున్నాం అమ్మభాషలో చదువు, అమ్మనేలపై నెలవు,
అన్నిభాషలూ నేరుస్తాం, అమ్మ భాషలో జీవిస్తాం....
నేరుస్తాం.... అమ్మ ఒడినుంచి ఓనమాలు...
చేస్తున్నాం నాన్నకు.... ఆ మేరకు పంపద్దని వేడికోలు
మా చదువు మా జ్ఞానం ఇవి మా కష్టం...
ఊపిరిచ్చిన మా నేలకే ఇవి సొంతం!
స్వార్ధం తెలియని ఈ వసంతం ఈసారి మాకే సొంతం!!
చెప్పమంటారా మా బాధ... పంచుకుంటారా ఈ గాధ...
నిత్యం కాసులకోసం వేట, అందని నిత్యావసరాల కోటా
కూలి ఎక్కువొస్తే సీమ మందు...సరిపోతే స్వదేశీ మందు
అప్పు దొరికితే నాటు మందు..మాకేగా వాటి ఘాటు వేటు!!
తాగి వచ్చే నాన్నలు, అమ్మ పడే బాధలు...పింఛను కోసం
వెళ్ళి
తిరిగి వస్తారో రారో తెలియని పెద్దతరం...! మాకు
వేరే లేదు నరకం!
అమ్మ భాషలో చదివించి, అమ్మనేలమీద కొలువిస్తే...
అమ్మ నాన్నల ఆదరిస్తాం, పెద్దతరాన్ని ఆదుకుంటాం!
ఉగాది పచ్చడి ఆరు రుచులతో భావితరాలకి పంచుతాం!
స్వార్ధం తెలియని ఈ వసంతం ఈసారి మాకే కావాలి సొంతం!!
No comments:
Post a Comment