About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

నాన్నమ్మ చెప్పిన కోడికథ

   ఆ రోజు నాన్నమ్మ వచ్చేసరికి పిల్లలందరూ అక్కడే ఉన్నారు. నాన్నమ్మని చూడగానే ఒకేసారి అరిచారు. “నాన్నమ్మ వచ్చేసింది! అంటూ అందరూ సర్దుకుని కూర్చున్నారు. కథ అయిపోగానే పడుక్కోకపోతే నాన్నమ్మ కోప్పడుతుంది. అందుకే పక్కబట్టలు కూడా సిద్ధంగా ఉంచుకుని కూర్చుని నాన్నమ్మవైపే చూస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చునేసరికి ఒక ఒంటె కోణంగి కోడిలా అరిచాడు.

   ఎవర్రా అది? కొంచెం సేపు నిశ్శబ్దంగా కూర్చోలేరా ఏం? అంది నాన్నమ్మ.

   ఏం లేదు నాన్నమా! కోడికథ చెప్తావేమో.. అడుగుదామనుకున్నాను. ఏమంటావోనని అరిచానంతే! నెమ్మదిగ అన్నాదు సతీష్.

   ఆ విషం అడగచ్చు కదురా? అల కోడి కూతలు కుయ్యకపోతే! పోనే నువ్వు అచ్చం కోదిలా కూశావు కనుక ఈ రోజు కోడికథ చెప్తాను. అందరూ గొడవ చెయ్యకుండా వినండిరా!ంది నాన్నమ్మ.

   హే! ఒక్కసారిగా అరిచారందరూ. నాన్నమ్మ కథ మొదలుపెట్టగానే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

   ఒక ఊళ్లో గంగయ్య అనే పేరుగల రైతుండేవాడు. అతడి దగ్గర ఒక కోడి ఉండేది. తెల్లవారి సూర్యుడు ఉదయిస్తాడనగానే ఆ కోడి కొక్కురోకో! అని కూత పెట్టేది. ఆ ఊళ్లోవాళ్లు అందరూ ఆ కూత వినగానే నిద్రలేచి వాళ్ల పనులు వాళ్లు చేసుకోడం మొదలుపెట్టేవారు. రైతు కూడా దాని కూత విన్నాక లేచి పనులు మొదలు పెట్టుకునేవాడు. ఇప్పుడు మనం అలారం మోత వింటున్నట్టే.. అప్పుడు కోడి కూత వినేవాళ్లన్నమాట!

   ఒకరోజు ఆ కోడి అనుకుంది .. నేను లేచి ఉదయాన్నే అందరినీ నిద్రలేపుతున్నాను. చక్కగా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. నేను కనుక, కూత కనుక, కూయకపోతే అందరు సాయంత్రం వరకు నిద్రపోతూనే ఉంటారు అనుకుంది. అలాంటి ఆలోచన రాగానే కోడికి గర్వంగా అనిపించింది. రోజు రోజుకీ దానికి గర్వం పెరిగిపోయింది.

   దానికి ఒక ఆలోచన వచ్చింది. “ఏమయినా సరే! రేపు ఉదయం కూతకూయకూడదు. అందరూ ఎలా  లేస్తారో చూడాలి” అనుకుంది.

   మర్నాడు కొక్కురోకో! అనే కోడి పిలుపు ఎవరికీ వినబడలేదు. పాపం! రైతు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఆవుదూడా పాలకోసం ఏడ్చింది. ఎద్దులు దాణాకోసం ఎదురు చూస్తున్నాయి. ఉదయాన్నే చెయ్యవలసిన పనులు ఆలస్యమైపోయాయి. ఊళ్లో వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు.

   రైతుకి చాలా కోపం వచ్చింది. కోడి దగ్గరికి వెళ్లి చూశాడు.  రైతు రావడం చూసిన కోడి గబుక్కున కళ్లు మూసుకుంది. రైతుకి దాని ఆలోచన అర్థమయింది.

   ఇదిగో ఇలా చూడు! ఉదయాన్నే లేచి అందర్నీ లేపుతావని నిన్ను మేపుతున్నాను. ఉదయాన్నే అరవని కోడి నాకక్కర్లేదు. హాయిగా కూరవండుకుని తినేస్తాను జాగ్రత్త!” అని చెప్పి వెళ్లిపోయాడు.

   కోడికి అర్థమయింది. భయం కూడా వేసింది. ఉదయాన్నే లేచి కూయకపోతే నిజంగానే కూరొండుకుని తినేస్తాడేమో..! అనుకుంది. దాని గర్వం పూర్తిగా దిగింది.

   మర్నాడు ఉదయాన్నే లేచి ఎప్పటిలాగే కొక్కురోకో! అని అరవడం మొదలుపెట్టింది. పొద్దున్నే కోడి కూయగానే లేవకపోతే మీరు కూడా బడికి వెళ్లలేరు. ఆ కోడి ఆ కూతని ఇప్పటికీ ఆపలేదు. అంటూ నాన్నమ్మ కథ ముగించింది.

   విన్నారా? ప్రతి పని మనముంటేనే నడుస్తోంది అనుకోవడం తప్పు. మనవల్ల కొంచెమైనా ఉపయోగం ఉండాలి. ఎవరి పని వాళ్లు చెయ్యకపోతే మనది కూడా కోడి బతుకే అవుతుంది.

   ఇంక పడుక్కోండి! కథ రేపటికి...మనం నిద్రలోకి..! అంటూ నాన్నమ్మ దుప్పటి తీసి ముసుగేసేసింది. పిల్లలందరూ కోడి కూయగానే లేద్దామని చెప్పుకుంటూ ఎవరి దుప్పటి వాళ్లు కప్పుకుని నిద్రలోకి వెళ్లిపోయారు.

  

                                        

No comments:

Post a Comment