About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 కవితలు

                                                              భమిడిపాటి బాలాత్రిపురసుందరి

                                                                        9440174797

 

నిత్య నూతన సాహిత్య రచనా విహారి! మన విహారి!!

కథకుడుగా విహారి!

నాటి, నేటి కథానికలన్నింటినీ చదువుతూ..

పాత రచయితల ప్రత్యేకతల్ని విశ్లేషిస్తూ..

కొత్త రచయితల రచనల్లో లోపాల్ని విమర్శిస్తూ..

తమ లోపాలు తాము తెలుసుకునేట్లు చేస్తూ..

ఇంకా మంచి కథానికలు రాయాలని భుజం తడుతూ..

బాధ్యతగా మరింత మంచి కథానికలు రాయడానికి 

అందిస్తున్నారు రచయితలకి కొండంత ఉత్సాహం!

చిన్న కథలోనే పెద్ద  విషయాల్నిచెబుతూ...

చెప్పే దానికన్నా ఎక్కువగా ఆలోచింపచేస్తూ ...

మనుషుల మధ్య ఉండే మనస్పర్థలూ, ప్రేమాభిమానాలూ,

వేరు వేరు వ్యక్తిత్వాలూ, ఆర్థిక సంబంధాలూ వివరిస్తూ...

అడుగడుగునా వాస్తవికతతో నడిపిస్తున్నారు కథలు!

విలక్షణమైన శైలి, మొదటి నుంచి చివరివరకు కలిగించే ఆసక్తి..

మంచి ఎత్తుగడ, సంక్షిప్తత, పాఠకుల కోరికకి తగిన ముగింపు.. 

విహారి కథలకి  కొసమెరుపులు!

ఎన్నో పత్రికల్లో రాసారు, రాస్తున్నారు విహారి!..  వారిది అవిశ్రాంత కలం!

వ్యాస రచయితగా విహారి!

వ్యాసాలు చిన్నవి.. కొత్త ప్రక్రియలతో విషయాలు అనేకం! 

వాల్మీకి హృదయాన్ని చూపించినట్టు గొప్పవైన పాత్రలతో..

విశ్వామిత్ర, మధుర, అనసూయ, శూర్పణఖ, వంటి వ్యాసాలు

పాఠకుల్ని అలరించాయి.. రచయితల్లో కొత్త ఆలోచలు రెకెత్తించాయి! 

కథాగతిని అనుసరించే పాత్రపోషణ జరగాలని స్పష్టీకరించారు!

కుటుంబానికి కావలసిన ఆర్థిక విధానాలూ, ఆదాయంలో  పొదుపు,

జీవనపథంలో అవసరమైన, సరళమైన ఆర్థికప్రణాళికలు 

మధ్యతరగతి జీవులకు ఉపయోగించే ఆర్థిక అంశాలెన్నో ప్రబోధిస్తూ..  

నిరంతరం ఆలోచించే సృజనశీలి విహారి! వారిది అవిశ్రాంత కలం!

 

 

సమీక్షకుడిగా, విమర్శకుడిగా విహారి!                                                                        

అనేక దిన, వార, మాస పత్రికలలో వందలాది గ్రంథసమీక్షలు!

రచనతోనే సంబంధం - రచయితతో కాదంటారు

ఒకనాటి భారతి నుంచి, ఈనాటి నూతన ఒరవడి వరకు

సమీక్షకుడుగా విహారి... భావాలకు మాత్రమే నిబద్ధుడు!

పాఠకుడు రచన ద్వారా రచయిత వ్యక్తిత్వాన్నీ తెలుసుకుని...

రచయిత మీద గౌరవాన్ని, ఆదరాన్ని పెంచుకుంటాడంటారు!

విస్తారమైన ఆయన అధ్యయనశీలతకి అందని  కథలూ..

కథకులూ... లేరు నాటి నుంచీ నేటివరకూ!

కాలానుగుణంగా వస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి!

విహారిగారి విశ్లేషణ, సమీక్ష, విమర్శలు యువతనే కాదు

ఆబాల గోపాలాన్ని ఆలోచింపచేస్తాయి!

ఆయన విమర్శకి నోచుకున్న ప్రతి కథ, కథకుడు ధన్యులు

యువ రచయితల వెన్నుతట్టారు.. రచనలో పాఠాలు నేర్పారు

మధ్యతరగతి జీవుల ఆర్థికావసరాలకు సలహాదారుగా నిలిచారు.

వయోధికులు  మెదడుకు మేతపెట్టే పదప్రజ్ఞలు చూపారు.

సాహిత్య విమర్శకు, సమీక్షకు ఎవరికీ అందరు..వారిది అవిశ్రాంత కలం!

గొప్ప రచయితగా విహారి

విహారిఅన్న కలం పేరుతో చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు

సంప్రదాయవాదులు ఆదరించేలా-పద్యాల్లో శ్రీపద చిత్ర రామాయణం

అభ్యుదయవాదులు, వచన కవితాభిమానులు మెచ్చేలా కవితా సంకలనాలు

వ్యక్తి-త్వం-వికసనంపేరుతో వినూత్న దీర్ఘ వచన కవితాకావ్యం

నవలలు, కథల సంపుటాలు, కవితా సంకలనాలు,

సరస్వతీదేవి కటాక్షవీక్షణాలతో ఎన్నో.. ఎన్నెన్నో.. రచనలు!

ఎందరో, నవ, యువ రచయితలను భుజంతట్టి ప్రోత్సహిస్తున్న

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి! ప్రపంచ తెలుగు సాహితీమూర్తి!

 

.

                                                                                                                                

 


No comments:

Post a Comment