కవితలు
ఆగిన వెన్నెల - ఆగని వెన్నెలపాట
వెన్నెల శాశ్వతం.. వెన్నెల పాట, మాట శాశ్వతం
పేరు రాజేశ్వరప్రసాద్. ‘వెన్నెలకంటి’ ఇంటి పేరు.
జన్మభూమి నెల్లూరు.. జననం 1957 !
పిన్న వయస్సులోనే శతకాల రచనకి శ్రీకారం!
చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల! పాటతో
తొలి పాట - రచయితగా తొలి పరిచయం!
మొదటి సినిమా శ్రీరామచంచ్రుడు..చివరిది ‘పెంగ్విన్’‘
మాటరాని మౌనమిది’... ఇదొక అద్భుతమైన సృష్టి!
మౌనంతో ముగింపు.. మౌనంతో ఆరంభం..
గానంతో ముగింపు.. గానంతో ఆరంభం...
ధ్యానంతో ముగింపు.. ధ్యానంతో ఆరంభం...
మొదటి పంక్తిలోని చివరి పదంతో రెండో పంక్తి..
ఇదే.. ఆకర్షించింది అభిమానులందరినీ!
డబ్బింగ్ సినిమాలకు పాటలు రాయడంలో దిట్ట
డబ్బింగ్ చిత్రాలకు పాటలు, మాటలు, స్క్రిప్ట్ రైటరూ వెన్నెలకంటే!
నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశం..
నేను ఆటోవాణ్ణి..’ అని మాస్‌కి కిక్ ఇచ్చారు.
‘హృదయం ఎక్కడున్నది..’ అంటూ ప్రేమికులకు మంచి పాటిచ్చారు
‘రాసలీల వేళ.. రాయబారమేల..’ అంటూ రొమాన్స్ పండించారు.
మంచి పాటలా మనసులో నిలిచిపోయారు!
300కి పైగా సినిమాలు, రెండువేలకి పైగా పాటలు!
నెల్లూరులో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకి
అభిమానుల వెంటనంటి.. నడిచేవారు వెన్నెలకంటి !
రాజేశ్వరప్రసాద్ ఇక లేరు...ప్రముఖ సినీ పాట, మాటల రచయిత
వెన్నెలకంటి కలం మౌనం వహించింది..
నింగికి జోల
వినిపించడానికి వెళ్లారు వెన్నెల..!
ఆ వెన్నెల కూడా ఈ వెన్నెలకు జోల పాడింది!
వెన్నెలకంటి కంటిపాపలు.. శశాంక్, రాకేందులు..
వెన్నెలకంటి కలానికి పాళీ, సిరాలుగా నిలిచారు!
వెన్నెల శాశ్వతం.. వెన్నెల పాట, మాట శాశ్వతం!!
No comments:
Post a Comment