కవిత
ఎక్సరే
నిర్వహించే నెలనెలా వెన్నెల కార్యక్రమంలో చదివిన కవిత 2022 జూలై 3 ఆదివారం
మంచి ఆలోచనలు చెద్దాం
ఆలోచనని అనుసరించే ఏర్పడతాయి విషయాలు.
శరీరంమీద ప్రభావం చూపించేది ఆలోచన
మనస్సులో కలిగే సూక్ష్మస్పందనే ఆలోచన
మనస్సులోనే ఆకృతి పొందుతుంది మనస్సు చేసే ఆలోచన
ఆలోచించే విషయం మారితే మనస్సు కూడ మారుతుంది
మనోఫలకంమీద ముద్రను వేసుకునే ఆలోచనే సంస్కారం
చెడు ఆలోచన పరిసరాల్ని కలుషితం చేస్తుంది..
ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటుంది జీవితం!
మంచి, చెడుల విచక్షణను
బట్టి తెలుస్తుంది ఆలోచనా విధానం....
ఇరుకు మెదడు మురికిగా ఆలోచిస్తుంది... అన్నాడొక రచయిత!
చెడ్డ ఆలోచన అథ:పాతాళానికి తోసేస్తుంది..
మంచి ఆలోచన చేరాల్సిన లక్ష్యానికి మార్గాన్ని చూపిస్తుంది!
మాటలు, చేతలు ఆలోచనల్ని
బట్టే వుంటాయి.
జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఒకే ఒక ఆయుధం ఆలోచన
ఆలోచనలు మంచివైతే మన పయనం మంచి వైపు..
ఆలోచనలు చెడ్డవైతే మన పయనం వినాశనం వైపు!
చిచ్చుబుడ్డీ పేలుతుంది - చిచ్చరకన్నూ పేలుతుంది
ఎండుగడ్డీ మండుతుంది - బడబాగ్నీ మండుతుంది
క్షణమాత్రం ఒకటి - అనంతకాల సందీప్తం ఒకటి'
అంటాడు సినారె.
ఇవి రెండూ రెండు విరుద్ధ భావాలకి ప్రతీకలు.
రెండు స్వభావాలు, రెండు ఆలోచనల మంటలు
ఒకటి తాటాకు మంటలా గప్పున ఆరిపోతుంది...
రెండోది చైతన్యం రేపే మంట.. ఇది అనంతకాల సందీప్తం.
గుప్పెడు చెడు ఆలోచనలు చేసేకంటే ..ఒక మంచి అలోచన చేస్తే..
వేల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు!
మంచి ఆలోచనలు చేద్దాం...సమాజంలో వెలుగులు నింపుదాం!
No comments:
Post a Comment