గ్రంథాలయ
వారోత్సవాల వేడుకల్లో ’మహిళా దినోత్సవ సందర్భంగా 19-11-2022
ఠాగూర్ స్మారక గ్రంథాలయ వేదికపై
కాలానికే
జవాబిచ్చిన మహిళాశక్తి (కాలంతో మగువ)
వేదకాలంలో మహిళలు చదువుకున్నారు.
ఋగ్వేదకాలంలో తమకు తామే భర్తను
ఎంచుకున్నారు!
ఇస్లాం రాజుల ఆక్రమణలు, మొఘల్ సామ్రాజ్యం, మతాలు ..
వంటివెన్నో మహిళల స్వేచ్ఛని, హక్కుల్ని హరించాయి!
సతీసహగమనం, బాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల నిషేధం ...
నిర్బంధాలు, ఆంక్షలు విప్లవాత్మక ఉద్యమాల్లో ఎదుర్కొన్నారు!
ముస్లిం ఆక్రమణ తెచ్చింది భారతీయ సమాజంలో పరదా ఆచారం..
రాజస్థాన్ రాజపుత్రుల్లో నడిచింది
జౌహర్ అనాచారం..
ఆలయస్త్రీలుగా ఉంటూ దేవదాసీలు
అనుభవించారు లైంగిక వేధింపులు!
హిందూ క్షత్రియ రాజుల్లో విస్తృతంగా వ్యాపించింది బహుభార్యాత్వం
..
రాజకీయ, సాహిత్య, విద్య, మత రంగాల్లో రాణిస్తూనే ఎదిరించారు!
ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా..
గోండు రాణి దుర్గావతి.. సాగించింది పదిహేనేళ్ళు పరిపాలన..
మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది చాంద్ బీబీ..
యోధురాలు, పాలకురాలు, మంచి తల్లిగా జిజియాబాయి!
భక్తి ఉద్యమానికి మీరాబాయి, హిందూ భక్తికి అక్క మహాదేవి,
రామి జనాభాయి, లాల్ దేడ్... సాధు-కవయిత్రులు..
భక్తి ఉద్యమం తరువాత
సిక్కుల మొదటి గురువు గురునానక్ మహిళే!
బ్రిటిషువారికి
వ్యతిరేకంగా తిరుగుబాటుని నడిపించింది ఝాన్సీ రాణి
ముస్లిం మహిళ మూడుసార్లు
తలాక్ చెప్పే పద్ధతిని విమర్శించింది!.
భారత జాతీయకాంగ్రెసుకు
అధ్యక్షురాలు,
రాష్ట్ర మొదటి గవర్నరు.. సరోజినీ నాయుడు..
పదిహేనేళ్లు భారతదేశపు ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ!
నేటి భారత దేశానికి రాష్ట్రపతి కూడా మహిళే!
ప్రాచీనకాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్నమహిళ
మధ్యకాలంలో కష్ట నష్టాల ప్రవాహాన్ని నెట్టుకుంటూ..
ఎదురీదుతూ...
కాలంతో ప్రయాణిస్తూ.. అన్నింటా నేనంటూ .. కాలానికే
జవాబిచ్చింది!
No comments:
Post a Comment