2017 హేవళంబి నామ ఉగాదికి పట్టిసీమ ఎత్తిపోతల
పథకం మీద మర్చి 29వ తేదీకి రాసిన కవిత
అపురూప శిల్పం “పట్టిసీమ ఎత్తిపోతల పథకం”!
ఆ కోరిక నేటికి నెరవేరింది...మనస్సుకి ఆనందం కలిగింది!
అందుకు సహకరించారు నేటి మన జలవనరుల శాఖామాత్యులు!
వాహనం ఏర్పాటు చేశారు...మంచి ఆతిథ్యమిచ్చారు..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం! అదొక అద్భుతమైన ప్రక్రియ!
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవేముందని నాటి సామెత..
పాలకులు తలుచుకుంటే సాధించలేనిది ఏముందని నేటి సామెత!
పోలవరం మండలంలో ఉంది ' పట్టిసీమ’ !
దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడి ఆయుధం పడిన ప్రదేశం..
ఆయుధం పేరు పట్టిస! ఊరి పేరు ' పట్టిసం’! పిలవబడుతోంది ' పట్టిసీమ’గా!
ఇది ఆనాటి చరిత్రలో ఒక ఆధ్యాత్మిక దేవాలయం..
ఈనాటి చరిత్రలో.. ఇదొక లక్ష్య సాధనతో సిరుల పంటల కోసం
నిర్మితమైన ఆధునిక సాంకేతిక నిర్మాణం!
అన్నమో చంద్రన్నా! అని అడగక ముందే.. పరిస్థితిని గ్రహించి
తన మేథాశక్తిని ఉపయోగించాడు చంద్రబాబు..
తన శ్రమశక్తిని అందించాడు ఉమామహేశ్వరుడు!
నీటిని భూమికి తీసుకుని వచ్చాడు.. ఆనాటి భగీరథుడు..
నీటిని ఒడిసిపట్టి రైతన్నల కష్టాన్ని తీర్చాడు.. ఈనాటి
భగీరథుడు!
కాలువల్లో ఇంకిన నీరు... నింపుతోంది రైతుల కంటిలో నీరు..
వర్షమే ఆధారం... అది కురవక పోతే ఉండదు జీవనాధారం!
వరద గోదావరి ఉరకలు పెడుతూ పరుగెడుతోంది సముద్రంవైపు..
ఆ నీటిని ఒడిసి పట్టి పరుగులు పెట్టించారు పొలాలవైపు!
ఆనాడు భగీరథుడు నీటిని ఎలా తెచ్చాడో.. చూడలేదు కళ్లతో..
ఈనాటి భగీరథుడు చేసిన కష్టం చూశాము... కన్నుల పండువుగా!
పట్టిసమంతా తిరిగాము...ప్రతి అంగుళము పట్టి పట్టి చూశాము..
కలిగాయి మాకెన్నో సందేహాలు...తీర్చారు పనిచేస్తున్న
శ్రామికులు!
పట్టిసంలో ఎత్తిపోతల పథకం ప్రయోజనం...నీటి ఎద్దడిని
తగ్గించడం..
వరద సమయంలో
సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టడం!
పంపులద్వారా తోడి పోలవరం కుడి ప్రధాన కాలువకి పంపడం..
ఆ కాలువ ద్వారా నీటిని కృష్ణా నదిలోకి వదలడం...!
నీరు అందక అలమటించే రైతన్నల పొలాల్లో పచ్చదనం నింపడం!
పోలవరం పథకం ఉండగా ఈ పట్టిసీమ ఎందుకు?
దీనికోసం పెట్టిన
ఖర్చు నిరుపయోగమని సందేహం..
పట్టిసీమ చూశాక తీరింది మా సందేహం!
అక్కడ పెట్టిన ప్రతి కాసుకి కలుగుతుంది వందరెట్ల ప్రయోజనం..
పోలవరం వైపు చూస్తూ... ఇంకెప్పుడా అని వేచి చూడద్దన్నాడు..
పట్టిసీమ అనే పోలవరాన్ని రైతన్నలకి ఇచ్చాడు చంద్రన్న వరంగా!
చంద్రన్న సంకల్పం...ఉమామహేశ్వరుడి చాకచక్యం...
అతి తక్కువ సమయంలో...అధునాతన యంత్రాలతో...
ఇంజనీర్లే యంత్రాలై ...శ్రామికులందరు ఒక్కటై...
పగలు రాత్రి సమమై ... అందరూ దేవ శిల్పులై..
రూపుదిద్దుకున్న అపురూప శిల్పం “పట్టిసీమ ఎత్తిపోతల పథకం”!
మనస్సులో ముద్రితమైన ఆ ’దృశ్యం’ ఎప్పటికీ కాదు ’అదృశ్యం’!
పనిని, పనిచేస్తున్నవాళ్ళని, చేయిస్తున్న వాళ్లని...ఒక్కచోట
చూశాము
చూడగలిగిన మా అదృష్టాన్ని .. అనందాన్ని అందరితో పంచుకుంటున్నాము!
ఇది అన్నదాతలకి చంద్రన్న సేన అందించిన కానుకగా...
రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా...భావి తరాలకి చాటుదాం!
మన రాష్ట్ర చరిత్రలో
దీన్ని పదిల పరిచి ఉంచుదాం!!
No comments:
Post a Comment