ఊరే ఉమ్మడి కుటుంబం
ప్రపంచమంతా ఒకే కుటుంబం...
ఇది నేటి మాట!
ఊరంతా ఒకే కుటుంబం...
అది నాటి మాట!
పెళ్ళిళ్ళు, వ్రతాలు, సంతర్పణలూ...
ఊరంతా కలిసే!
పెళ్ళిళ్లకి సంబంధాలు, చదువులు...
ఉద్యోగాలూ ఊరిమధ్యే!
కుటుంబాల మధ్య స్నేహంతో...
ఊరే ఉమ్మడి కుటుంబం!
వృద్ధులు, నడివయసువాళ్ళు,
యువకులు, పిల్లలు...
కలిసికట్టుగా ఒకే
కుటుంబంగా!
కష్టం, సుఖం, బాల్యం, వృద్ధాప్యాలు..
అవగాహనే... నేర్పుతుంది సేవాభావం !
మంచి నడవడిక కలిగిన వాళ్లు…
ఊరి పిల్లలందరికీ ఉపమానం!
పాఠాలతో జీవిత సత్యాలు, మెళుకువలు,
క్రమశిక్షణ నేర్పించే గురువులు,
ఊరి పెద్దలు...పిల్లలకి అడుగుజాడలు!
ఊరే ఉమ్మడికుటుంబమైతే...
వృద్ధులకి ఊరి పిల్లలే ఆలంబన!
ప్రపంచమే ఒక కుటుంబమైతే...
చదువులు, ఉద్యోగాలు, సంపాదన,
ప్రపంచ ప్రజలతో బాంధవ్యాలు...
దేశ అభివృద్ధికి మంచిదే!
అది పెంచుతోంది...
తల్లితండ్రులకి, పిల్లలకి మధ్య ...
బాంధవ్యాల దూరం!
పెద్దల అవసరానికి వృద్ధాశ్రమాలే
అవుతున్నాయి ఆశ్రయాలు
ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేదిట!...
మిగులుతోంది విషయం!
జ్ఞానాన్నిపంచిన ఊరు...
మిగులుతోంది ఉమ్మడి వృద్ధాశ్రమంగా!!
No comments:
Post a Comment