నెలనెలా వెన్నెల ఎక్సరే
వారి కవిసమ్మేళనం 05-03-2023
దేశభవిష్యత్తుకు విద్యాసంస్థలే వేదికలు
జీవించడానికి నీరు అవసరం..
కలుషితమైతే శుద్ధిచేసి తాగాలి..
దేశానికి రాజకీయం అవసరం..
కలుషితమైతే శుద్ధి
చేసి కాపాడాలి!
యువత ప్రయోజనాలు తీర్చాలి..
యువశక్తి దేశానికి అవసరం!
ఎన్నికల బాధ్యత, ఆలోచన
యువతకి అవసరం!
ప్రజాస్వామ్యానికి
శక్తిని యిచ్చేది వోటరు..
రక్షణ కవచం వోటరు!
’ఏమీ చేయలేము, జనాన్ని
మార్చలేము,..
అందరినోట ఇదే మాట..
ప్రాణత్యాగం చేసిన
మహనీయులు
ఇలాగే అనుకుంటే..
తెల్ల దొరల కింద బానిసత్వం
పోయేది కాదు.. విముక్తి దొరికేది
కాదు
ఆస్తులే కాదు..
ఉత్తమ పాలనా వ్యవస్థ
కూడా వారసత్వపు సంపదే!
సమాజంలో అవినీతి ఊడలు
విస్తరిస్తే..
పోరు జరుగుతూనే ఉండాలి..
జాతి ప్రతిష్ఠ మసక బారుతూ
పోతే..
సంస్కరణల పర్వం ముగిసిపోతుంది!
యువత
పనిముట్లు కావాలి..
ఉపాధ్యాయులు వాటికి
పదునుపెట్టాలి..
వారు చెక్కిన శిల్పాలే
ప్రజాస్వామ్య
విజయానికి
కీలకమని
తెలియాలి!
సమస్యల్ని పలు కోణాల నుంచి
విద్యార్థి అధ్యయనం చేయాలి..
వీరుడి చేతిలో ఆయుధాల్లా..
ఓటు హక్కు
వినియోగించుకోవాలి
విద్యతో పొందిన వినయాన్ని
ప్రదర్శించాలి..
ప్రజలను మెప్పించగలగాలి!
విద్యార్థి దశలోనే నేతల్ని
ఎంచుకునే
నేర్పు తెలిసి ఉండాలి!!
దేశ భవిష్యత్తు నిర్మాణం
జరగవలసింది తరగతి గదుల్లో..
అందుకు విద్యాసంస్థలే వేదికలు..
No comments:
Post a Comment