సాహితీ రసస్రవంతి- 12-4-23
సామాజిక కల రచయితలది!
నిద్రకి చెందిన
కొన్ని స్థితులలో
అసంకల్పితంగా మనసులో
మెదిలే భావాలే కలలు
భావావేశాల, ఇంద్రియ సంవేదనల
సందోహాలే కలలు.
కలల యొక్క అంతరార్థం
ఏమిటో,
వాటి ప్రయోజనం ఏమిటో
ఇప్పటికీ
మనకి పూర్తిగా అర్థం
కాదు!
ప్రతి మనిషి కలలు చూస్తాడు.
దేని గురించయినా కలలు
కనవచ్చు
కలలు కనడం మామూలే!
సైన్స్ ప్రకారం, కలలో కనిపించేది
భవిష్యత్తును సూచిస్తుంది!
కలలు కొన్ని అశుభాన్ని
సూచిస్తాయి.
కొన్ని శుభాన్ని
సూచిస్తాయి!
నిద్రలేవగానే కొన్ని కలలను మరచిపోతాం,
కొన్ని కలలు గుర్తుంటాయి!
జీవితాల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి
భవిష్యత్తు సంఘటనలకు ఆధారాలు ఇస్తాయి!
కల అర్థరహితం కాదని చెప్తుంది స్వప్న
శాస్త్రం
అనుభూతిని పొందిన కలని శుభమని
నమ్ముతారు
కలల గురించి చేసే శాస్త్రీయ అధ్యయనాన్ని
ఓనేరాలజీ (Oneirology) అంటారు!
మనకి కనిపిస్తుంది కలలలో
అంతరార్థం ఉందన్న నమ్మకం,
కలల సహాయంతో భవిష్యత్తుని
తెలుసుకోవచ్చన్న నమ్మకం!
కలలని కేవలం భౌతికంగాను,
జీవ శాస్త్ర దృక్పథంతోను
ఆలోచిస్తే... నిద్రావస్థలో
నాడీ సంకేతాల చలనాలకి
ఫలితాలుగా చెప్పుకోవచ్చు!
మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే ...
ఉపచేతనలో జరిగే చలనాలకి
ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు!
అధ్యాత్మికంగా చూస్తే ..
దివ్య సందేశాలు గానో, భవిష్యత్తుని
తెలిపే
దూతలు గానో చెప్పుకోవచ్చు!
ప్రపంచ భాషల్లో ఏ
రచయితకైనా
ఒక సామాజిక కల ముంటుంది.
సామాజిక కలంటే..
రచయిత దష్టిలో సమాజం
ఎలా ఉండాలి అన్న
భావనే.
సామాజిక కల లేకుండా
రచయిత ఏదీ రాయడు, రాయలేడు!
సామాజిక కలలు
రచయితలకు
సమకాలీన
జీవితానుభవంలోంచే
రూపుదిద్దుకుంటాయి...
మంచి కవితలు ఆవిర్భవిస్తాయి!
No comments:
Post a Comment