తెలుగుభాష చరిత్రలో ‘శ్రీ శ్రీ’ కి అక్షర నీరాజనం !!
పేదసాదల జీవితాలు,
కష్టనష్టాలు తెలుగు సాహిత్యంలో
ప్రతిబింబించిన మొదటి కవి…
* ఆంధ్రులకి చిరస్మరణీయుడు!
రాజవీధులు, పండితుల చర్చాగోష్టులు,
రాజ దర్బారులకే కాదని..
సామాన్యుడి మట్టి వీధుల వరకూ..
తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లాడు!
పేదల జీవితాల్లో మార్పు రావాలి..
నవసమాజ నిర్మాణం
జరగాలి...
కొత్తపునాదులతో, నూతన నిర్మాణం
*భావితరాలకు
అందాలి…!
అదే ఆకాంక్ష!
దీక్షతో
కవితా సంప్రదాయాన్ని మార్చి..
సాహిత్య
క్షేత్రంలో పరివర్తన తెచ్చి..
కవుల్నికలవరపరిచే
సమస్యల్ని
*పరిష్కరించడమే
శ్రీశ్రీ ధ్యేయం!
*తీవ్ర
విమర్శకుడైనా.. మెచ్చుకోక తప్పదు..
సంవిధాన
చాతుర్యం, వైవిధ్యం, తనదైన
బాణి ..
*అన్ని
దేశాల్లో, అన్ని భాషల్లో శ్రీశ్రీకి దక్కిన ఆస్తి!
మామూలు
మాటలకు ప్రాణం,
బరువులేని
బలం, మరుగులేని స్వచ్ఛత,
కరువులేని
శిల్పం, ప్రతి మాటా, ప్రతి ఊహా
*మనస్సుల్ని
కట్టి పడేస్తుంది !
దొరికిన
ప్రతి వస్తువుని కవితామయంగా
* చేసే
స్పర్శవేది తెలిసినవాడు!
అకుంఠితమైన
పటిమ, అమోఘమైన శిల్పంతో ..
ఆనాటి
సామాజిక సమస్యల్ని
జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులతో
సమన్వయపరిచాడు!
ప్రపంచాగ్నిలో సమిధగా, విశ్వసృష్టిలో
అశ్రువుగా,
భువనఘోషలో గొంతుకగా..
మాటల పొదుపుతో గొప్ప కావ్యశిల్పాన్ని
రూపొందించగల సామర్థ్యం శ్రీశ్రీ గొప్పతనం...!
పద్యరచనల్లో ఎంత తేలిక మాటలో,
*పద్యశీర్షికల్లో అంత ప్రౌఢశబ్దాలు!
వస్తు సంవరణంలోనే కాదు..
రచనా సంవిధానంలో కూడా విప్లవమే!
తన
రచనల్లో లోకం ప్రతిఫలించాలని
*గాఢంగా
కోరుకున్నాడు..సాధించాడు!
వయసు
పెరిగినా.. పసివాడు,
అమాయకతతో
చురుకైనవాడు,
అహంకారమున్నా..
తలవంచుతాడు.
*ఆకర్షించగలడు..
ఏడిపించనూగలడు..!
అభిప్రాయాల
విషయంలో జగమొండి..
సరదా పడితే
ఆగదు కలం!
ఆలోచనా
ధోరణి పెరిగితే క్రమశిక్షణకు లొంగడు. .
దాపరికం
లేదు.. ఆలోచన,
స్వభావాల్లో
చాటూ మరుగూ
లేదు!
ధోరణిలో
లేదు పోరాటం …
*మాటల్లో
భయంకరమైన పోరాటమే!
సామాజిక
విప్లవం నడవాలంటే..
సాహిత్య
విప్లవం సాగాలంటూ..
*వీరవాణితో
తన గొంతు వినిపించాడు!
పీడిత
వర్గాల క్షేమానికే రచనలనీ ..
చేసిన ప్రతిజ్ఞ
చివరివరకు వదలని-- శ్రీశ్రీ...
తెలుగుభాష, జాతి ఉన్నంత కాలం
చరిత్రలో వెలుగుతూనే ఉంటాడు!!
No comments:
Post a Comment