కరోనా పాదాలు - బాలల పదాలు!!
1.బాలల్లారా! రారండి!
కరోనా కథనం వినిపిస్తా
ప్రమాదమది
కానేకాదు
ఆరోగ్య రహస్యం చెప్పింది!
2. మంచికి మంచే చేస్తుంది
చెడు చూస్తే ముంచుతుంది
చెడు చెయ్యడం మానమంది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
3. బాలలు చెడు చెయ్యరంది
భయమసలే వద్దంది
మంచిగమారి చూపమంది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
4. అమ్మ చెప్పిందే వినమంది
అమ్మలకే అమ్మ తనంది
బాలల గురువే అమ్మంది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
5. ఉదయం నిద్ర లేవమంది
సూర్యుడికి దణ్ణం పెట్టమంది
ఆరోగ్యానికది మంచిదంది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment