కరోనా పాదాలు - బాలల పదాలు!!
6. చక్కగ స్నానం చెయ్యమంది..
బట్టలు
ఉతికి కట్టమంది..
బడికి
వేళకి వెళ్లమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
7. అల్పాహారం మానమంది..
చద్దన్నమే మంచిదంది..
బయట
తినడం రద్దంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
8. జ్ఞానం పంచేది గురువంది..
గురు వందనం చేయమంది ..
స్నేహం పంచేది
హితులంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
9. మంచి నడతే కోరింది..
నడత మంచిదైతే రానంది..
మార్చి నడిస్తే
వదలనంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
10.. బాలల్లారా! రారండి!..
కరోనా కథనం
విపిపిస్తా ..
వచ్చినదెందుకో వినమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment