భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్లు
స,
రి,
గ,
మ,
ప,
ధ,
ని!
ప్రతి
శుద్ధ స్వరం స, రి, గ, మ, ప, ధ, ని
ఆవిర్భవించాయి జంతువులు, పక్షులు
కూతల
నుండి! ఇవే సప్తస్వరాలు!
సప్తస్వరాలు
శరీరంలో ఏడు చక్రాలతో
సంధించబడ్డాయి..
ఆరోహణ పద్ధతిలో...!
చక్రాలు కూడా
ఆరోహణ లోనే!
కోమల
స్వరాలు ఇడ, పింగళ, సుషుమ్న
ఎడమవైపు
చక్రాలతో.. సంధింపబడితే..
శుద్ధ, తీవ్ర
స్వరాలు కుడివైపు చక్రాలతో..!
చూపుతుంది
ప్రభావం! ప్రతి రాగం..
దానికి
అనుసంధించబడిన.. చక్రం ప్రకారం!
సంస్కృత భాషలో ఉంది ఒక ప్రత్యేకత..
పదము పుడుతుంది ధాతువులనుంచి..
మూల కారణం చుట్టూ ఉన్న ప్రకృతి!
మనుషులలో
ఉండే త్రిగుణాలు...
సత్వ, రజస్తమో గుణాలు
విశ్వంలో
అన్ని గణాల్లోనూ ఉంటాయి.
వృక్షాల్లోనూ, జంతువుల్లోనూ, రాళ్లలోకూడా
స్వరాలతో
కూర్చిన రాగాలన్నీ
ఉంటాయి ఈ
మూడు గుణాలతో!
ఆ రాగ
గుణాలు కూడా ఈ సప్త స్వరాలు
ఆయా
జంతువులలో ఉండే ఉత్కృష్ట గుణం –
వాటి
గురించి తలచుకోగానే
మనకి
తట్టే మంచి గుణం ఏదుందో
అదే రాగ
గుణానికి హేతువవుతుంది
శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా
మార్చే విలక్షణమైన
ప్రక్రియ సంగీతం ..
సుప్రసిద్ధమైన
చతుషష్టి కళలలో ఒకటి
విశ్వమంతా
వ్యాపించి ఉంది..ప్రకృతిలో
మిళితమైంది..జీవన
గమనంలో భాగమైంది
సప్త స్వరాలు – కర్నాటక సంగీతంలో
ఉన్నాయి.. ఏడు సంగీత గమనికలకు
20 ప్రతిస్పందనలు..
దేవతలకు సంబంధించిన మూలాలు ..
అవి నాదబ్రహ్మకు చిహ్నం!
వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో
ఉచ్చరింపబడే సంగీత
స్వరాలు,
అవే సప్తస్వరాలు! స-రి-గ-మ-ప-ధ-ని!
భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్లు!
No comments:
Post a Comment