About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత డాక్టర్స్ డే సందర్భంగా

 

          వైద్యో నారాయణో హరిః

వ్యాధులు నయం చేసేవాడు వైద్యుడు..

వైద్యుడుగా అవతరించినవాడు దేవుడు!

మొదటి వైద్యం ఆయుర్వేద వైద్యం!

అధర్వణ వేదంలో భాగం ఆయుర్వేదం!

బ్రహ్మ ఉపదేశించాడు దక్షప్రజాపతికి..

అతని నుండి అశ్వినీ దేవతలు.. వారినుండి ఇంద్రుడు...!

 ఇది పురాణ వాక్యం!

ధర్మార్థ కామ మోక్షాలకి అడ్డుగా ఉన్న

అనేక వ్యాధుల్నినయం చేయాలనుకున్నారు

భరద్వాజ, త్రేయకశ్యప, కాశ్యపనిమివంటి 

ఋషులు! అడిగారు త్రిలోకాధిపతి ఇంద్రుణ్ని..! 

ఉపదేశించాడు ఇంద్రుడు..! కాయబాలగ్రహ,

ఊర్థ్వాంగ, శల్య, దంష్ట్ర, జరా, వృష 8 విభాగాలతో..

ఋషులు అందచేశారు భూలోకానికి!  

అగ్నివేశుడు రచించాడు...అగ్నివేశ తంత్రం..

మొదటి ఆయుర్వేద గ్రంథం!

విశ్వవ్యాప్తిపొందింది.. ఆయుర్వేద అవతరణ జరిగింది!

దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు...

అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథంతో

ఆవిర్భవించాడు ధన్వంతరి..!  వైద్యో నారాయణో హరిః !

వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమన్నారు!

ధన్వంతరి లక్షశ్లోకాల ఆయుర్వేద శాస్త్రం ఉపదేశించాడు..

'శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం'....

సమస్త ధర్మ సాధనాలలోకి శరీర రక్షణే ముఖ్యం

భారత వైద్య పిత, వైద్య నారాయణుడు ధన్వంతరి

వైద్యానికి మూలం ధన్వంతరీకులు!

 సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు,

కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు!

సుశ్రుతుడు గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు.

గొప్ప గురువు, ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు

వివరించాడు..సుశ్రుతుడు వివిధ శస్త్ర చికిత్సలు, 

చికిత్సా విధానాలు వివరించాడు చరకుడు.. 

మొట్టమొదటి సర్జన్ జీవకుడు..

ఔషధ మొక్కల ప్రాముఖ్యత చెప్పాడు కాశ్యపుడు..

జ్వరాలని తగ్గించడం చెప్పాడు.. వాగ్భటుడు

కుటుంబ వైద్యులుండే కాలం ఒకప్పుడు.

ఆత్మీయంగా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా..

స్నేహితుడిగా.. కలిసిమెలిసి..

వ్యక్తి దగ్గరికే వెళ్లేది వైద్యం!

తరువాత వచ్చి చేరాయి... అల్లోపతీ, హొమియోపతీ, సిద్ధ,

యునానీ, మూలికా, ప్రకృతి వైద్యం, యోగాలు..!

ఆధునిక కాలంలో.. ఆధునిక వైద్యంలో.. వైద్యులు

ఇరుగుపొరుగు దేశాలకి ..కూడా వైద్యసేవలందిస్తున్నారు ...

ప్రముఖ వైద్యుడు, సేవాతత్పరుడు డాక్టర్ బిసి రాయ్

జన్మదినమే.. జాతీయ వైద్యుల దినోత్సవం! 

వైద్యుల సేవా నిరతి..  మన భారతావనికే సొంతం!! . 

No comments:

Post a Comment