ఆకర్షణ – ఆవేశం – ఆలోచన – ఆచరణ 11-10-2023, సాహితీ స్రవంతి
ఏదైనా గమ్యం చేరడానికే
ఆకర్షణ
పరమాత్మ నుంచి ఉద్భవం... ఆజ్ఞానం వల్ల పతనం
జ్ఞానోదయమే పరమాత్మ వైపు ఆకర్షణ
“అయస్కాంతోపలం సూచిక!''
ముందు భగవంతుణ్ని స్మరించాలి
తనంతట తానే వస్తాడు.. ఆకర్షించుకుంటాడు
సూదంటురాయికి, ఇనుపముల్లుకు మధ్య
ఉండేది ఆకర్షణ!
భక్తుడికి పరమాత్మకి మధ్య
ఉండేదీ ఆకర్షణ!
ఆవేశం
''రసాంతరాణి ఏకరసం యధాదివ్య పయోన్నుతే''
నదులన్నింటికీ ఉన్నాయి ప్రత్యేకమైన పేర్లు.
భిన్నంగా ఉంటాయి నదీజలాల రుచి, రంగులు
ప్రవహిస్తాయి వివిధ మార్గాల్లో, పలు ప్రాంతాల్లో
చివరకు కలుస్తాయి సముద్రంలో!
పోగొట్టుకుంటాయి సహజస్థితి..
మిగిలేది ఉప్పదనం.. సముద్రజలాల రంగు!
ఉండాలి భగవత్సాన్నిధ్యాన్ని చేరే ఆవేశం..
వివిధ మార్గాలు, వివిధ దిశలలో పయనించి,
చేరుకోగలగాలి గమ్యం!
అలోచన
ఇబ్బందులుంటేనే పరమాత్ముని
ధ్యానించాలనే ఆలోచన..
సుఖమయ జీవితంలో భగవంతుని మరుపు!
జ్ఞానాన్ని అన్వేషిస్తాం.. అదే మన అజ్ఞానస్థితి!
మర్కటకిశోరం తల్లికోతిని ఆశ్రయించి ఉంటుంది..
భక్తుడు ఆశ్రయిస్తాడు దేవదేవుని పాదపద్మాలు..
మంచి ఆలోచనే కష్టాల్ని తొలగిస్తుంది!
''లతా క్షితిరుహం''
వృక్షాన్నుండి విడదీస్తే నిలబడలేదు తీగ.
భగవంతుడి చేయూతను.. ఆధారాన్ని
ఆశ్రయించుకొని సాగాలి మనిషి.
పరమాత్ముని వద్ద నుండే ప్రపంచంలోకి...
ఉండాలి ఆయన సాన్నిధ్యానికే
చేరుకోవాలన్న ఆలోచన!
అచరణ
''చంచలం హి మన: కృష్ణ''
విషయాలపై సంచరించే మనసు
నియంత్రించు!..
భగవంతుని పాదాలవద్ద
స్థిరీకరించు!
''మదీయం ఏవ స్వరూపం దేహి.''
కందిరీగ కుట్టిన కీటకం కందిరీగైనట్టు..
అంకోలా విత్తనం చెట్టు నుంచి పడి..
తిరిగి అదే చెట్టుకు చేరినట్టు..
ప్రసరిస్తే నిర్విరామంగా భగవత్కృప...
వచ్చిన చోటికే చేరుకుంటాం !
భగవంతుడి వైపు ఉండాలి ఆకర్షణ..
అందుకు కావాలి ఆవేశం
మార్గం వైపు ఉండాలి ఆలోచన...
చేరడానికి కావాలి ఆచరణ!
.
No comments:
Post a Comment