సాహితీరసస్రవంతి
25-10-2023
అంశం: గ్రహణం
శీర్షిక: గ్రహించవలసిన
విషయాలెన్నో..
గ్రహణం
కమ్ముతున్న వృద్ధాప్య దశలో చెయ్యవలసిన సేవలు గ్రహించమని చెప్పింది మహాభారతంలో
భీష్మనిర్యాణ ఘట్టం..! దాని గురించే నా కవిత.
వ్యాసమహర్షి
ఎప్పుడో ఇచ్చిన సూచనల పర్వం
ఆధునిక ప్రపంచ
వైద్యులను విస్మయ పరిచింది ..
ఒళ్లంతా గుచ్చుకొన్న
బాణాలతో భీష్ముడు నేలకొరిగాడు..
చనిపోలేదు.. 58 రోజులు
బాణశయ్య మీద బ్రతికాడు!
భీష్ముడిని
పాండవులు చూసుకున్న తీరు
ఆధునికులను
వ్యాసుడు గ్రహించమన్నాడు!
వృద్ధుల అనుభవాలలో..
విశేషమైన అనుభవజ్ఞానం..
అందిస్తుంది
యువలోకానికి విజ్ఞాన భాండాగారం!
దుర్యోధనుడు
చనిపోయాడు, ధర్మరాజుకి జరిగింది పట్టాభిషేకం
భీష్ముడు
జీవించే ఉన్నాడు ..
వ్యాసుడు, కృష్ణుడు ,ధర్మరాజుకు
గుర్తు చేశారు..
వృద్ధుడు
గతిస్తే..ఆయనతోనే అంతరిస్తుంది.. మహావిజ్ఞానం
కురువృద్ధుడి
దగ్గర ఉంది.. అపారమైన జ్ఞానం
తాతను సేవించి
తెలుసుకోమన్నారు!
తాత చెప్పిన
విషయాలు సకల శాస్త్ర సారాలు...
ధర్మరాజు తన
గ్రహణశక్తితో గ్రహించి నిక్షిప్తం చేశాడు
చికిత్స జరుగుతున్నప్పుడే
వ్యక్తి రోగి అవుతాడు.
చికిత్స
లేనప్పుడు అతడికి చేయాలి అంత్యకాల సేవ!
ధర్మరాజు
గ్రహించాడు.. సేవ మొదలుపెట్టాడు
భీష్ముడు
క్రింద పడగానే వచ్చి చేరారు వేలాది కన్యలు
ప్రదేశాన్ని
శుభ్రంచేశారు.. గంధపు పొడి, పేలాలుచల్లి,
రంగురంగుల పూవులతో
అలంకరించారు!
అతిముఖ్యమైన
అంశం వ్యాసుడు గ్రహించమన్నాడు
భీష్ముడు మానవ
భోగాలకు అతీతుడనన్నాడు
ముల్లోకాల మహర్షులు, యతులు, పరమహంసలు,
దేవతలతో... భీష్ముడి
దగ్గరకు వచ్చి చేరారు!
నారదాది
సంగీతవిద్వాంసులు వచ్చారు.
సమస్త రుషి
గణాలూ పఠించారు నాలుగు వేదాలు
అన్ని రుతువులు
కురిపించాయి పుష్పవర్షాలు
సంగీత వాయిద్యాలతో అప్సరసలు ఆడారు.
ఆనందమవసాన దశకు
అవసరమన్నారు!
ధర్మరాజు
గ్రహించాడు.. అంత్యదశ సేవల్లో విశ్రాంతి అవసరం..
సూర్యాస్తమయ సమయాన్ని
మహర్షులు గౌరవించారు
ధర్మరాజు, కృష్ణుడు కూడా
నిష్క్రమించారు!
ఉదయాన్నే ధర్మరాజు
భీష్ముణ్ణి దర్శించి
ముఖ్యమైన
రహస్యాలు తెలుసుకున్నాడు
అన్నీ
గ్రహించానని కృతజ్ఞతతో తాతకు సాష్టాంగ పడ్డాడు
గ్రహించిన
ధర్మశాస్త్రాలన్నీ ప్రజలకందించాడు
శ్రీకృష్ణుడు
రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమన్నాడు
పశువులైనా
గుర్రాలు కూడా గ్రహించాయన్నాడు
అంత్యకాల దశలో
నిశ్శబ్దం... భగన్నామ స్మరణకని
ధర్మరాజు
గ్రహించానన్నాడు.. వ్యాసుడు ఆశీర్వదించాడు
శ్రీకృష్ణుడు
భీష్ముణ్ని తనలో లీనం చేసుకున్నాడు!
No comments:
Post a Comment