సాహితీరస స్రవంతి లో 15-11-2023
నిఘంటువులు - నామ వివరాలు- కవులు
ఆక్షర క్రమంలో పదాలు, వాటి అర్థాలు కలిగినదే
నిఘంటువు, పదకోశము, వ్యుత్పత్తి కోశము !
తెలుగు భాషలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించాడు..
ప్రఖ్యాత నిఘంటువు!
1604 ఉపాధ్యాయుడు రాబర్ట్ కాడ్రే రాశాడు..
మొదటి పూర్తి ఆంగ్ల నిఘంటువు!
గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర నిఘంటువు..
యాస్కుడు
కశ్యపుడు వంటి ముని పుంగవుల
వేదానికి చెందిన నిఘంటువు నిరుక్తము!
అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి
వంటివి పర్వాయపద
నిఘంటువులు!
దండినాథుని
నానార్థరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము
శబ్దాల నానార్థాలను
తెలిపే నానార్థ నిఘంటువులు!
సూరయామాత్యుడు
రచించిన నానార్థరత్నమాల
తెలుగులో నానార్థ
నిఘంటువు !
సంస్కృత భాషలో
శబ్దబోధక.. శబ్ద వ్యుత్పత్తిని వివరించేవి
ఏకాక్షర
నిఘంటువులు!
తెలుగులో వివిధ
దేశ్యములైన పేర్లతో కృష్ణయామాత్యుడి
రచించాడు దేశ్యనామార్థకోశ
నిఘంటువు!
1590-1670 మధ్యలో
30 సీస పద్యములలో అచ్చతెలుగులో కూర్చబడింది.
కవిచౌడప్ప సీసపద్య నిఘంటువు!
పద్యాలు, పదాలతో పైడిపాటి లక్ష్మణకవి రచించాడు
ఆంధ్రనామసంగ్రహ నిఘంటువు!
మిగిలిపోయిన మరికొన్ని
పదాలు కలిపి
(సా.శ.1750 లో) ఆడిదము సూరకవి రచించాడు
ఆంధ్రనామశేషము అనుబంధ నిఘంటువు!
(సా.శ. 18వ శతాబ్దమునకు చెందిన)
వెచ్చ కస్తూరిరంగకవి రచించాడు సాంబనిఘంటువు
1810 సం. న
మామిడి వెంకయ్య అకారక్రమంలో ఆంగ్లపద్ధతిలో
రచించాడు మొదటి ఆంధ్రదీపిక నిఘంటువు!
సా.శ.1840
శ్రీ.రాజా త్యాడిపూసపాటి వీరపరాజు రచించాడు
ఆంధ్రపదాకరము పద్య నిఘంటువు!
క్యాంబెలు
తప్పులు సరిదిద్ది బ్రౌణు దొర
తెలుగు
పాండిత్యము సంపాదించి రచించాడు
బ్రౌణ్యనిఘంటువు!
తెలుగు పదాలకు
ఆంగ్లార్ధము, ఆంగ్లపదాలకు తెలుగర్థముతోను,
అన్యదేశ్యపదాల అర్థాలతో
రాసినది మిశ్రనిఘంటువు!
సా.శ.1860
గణపవరపు వేంకటకవి
రచించాడు .. దేశీయములు,
తత్భవములు అచ్చ తెలుగు పదాలు,
దైవత మానవ స్థావర
తిర్య
జ్ఞానార్ధవర్ధుల విభజనతో.. 128 సీస పద్యాల్లో
పర్యాయపద సర్వలక్షణశిరోమణి శ్రీ
వేంకటేశాంధ్ర నిఘంటువు!.
సా.శ. 1875-80
అకారక్రమంలో పదాలకు
పట్టికలు తయారుచేసి,
చెయ్యకుండానే దివంగతుడయిన
చిన్నయసూరి నిఘంటురచన
తెలియక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
సా.శ. 1885లో
శ్రీ. బహుజనపల్లి సీతారామాచార్యులు రచించాడు
ఆచ్చికపదముల అర్థాలు, అర్ధాంతరాలతో శబ్దరత్నాకర నిఘంటువు!
సా.శ. 1888లో
శ్రీ ఓగిరాల జగన్నాధకవి గారు రచించి మరుగుపడిన
దేశ్యపదములు ఎన్నో కలిగిన ఆంధ్రపదపారిజాత నిఘంటువు!
1903లో
సరస్వతుల సుబ్బరామశాస్త్రి శబ్దార్ధచంద్రిక
అచ్చతెలుగు నిఘంటువు!
శ్రీ పం.తిరువెంకటాచార్య
రచించాడు
శబ్దార్ధకల్పతరువు నిఘంటువు!
శ్రీతాటికొండ తిమ్మారెడ్డి రచించాడు శబ్దార్ధచింతామణి నిఘంటువు!
1906లొ శ్రీమహంకాళి సుబ్బారాయుడు శబ్దార్ధచంద్రిక నిఘంటువు!
1903లో శ్రీ కొట్రలక్ష్మీనారాయణశాస్త్రి లక్ష్మీనారాయణీయము
శుద్ధాంధ్ర ప్రతిపదార్ధ
పదనిఘంటువు!
1905లో శ్రీశిరోభూషణము రంగాచార్యులు గారు శబ్దకౌముది
1908లొ శ్రీ నాదెళ్ళ పురుషోత్తమకవిగారు ప్రకృతి రూపప్రకాశిక,
అన్యరూపదీపిక, విశేషరూపదర్శిక విభజనలతో
పురుషోత్తమియము నిఘంటువు!
1920 సం శ్రీ సూర్యారాయాంధ్ర ఆంధ్రవాచస్పత్య నిఘంటువు!
తెలుగు-తెలుగు నిఘంటువులు ఆంగ్లం-తెలుగు నిఘంటువులు
తెలుగు-ఆంగ్లం నిఘంటువులు బహు భాషా నిఘంటువులు
ప్రత్యేకమైన నిఘంటువులు,
అంతర్జాల నిఘంటువులు
మనకు తెలియనివీ, ఉపయోగించుకోడం చాతకానివీ ఇలా ఎన్నో నిఘంటువులు!
తెలుగులో మనకు తెలిసిన
పదాలే తక్కువ కనుక,
అర్థాలు వెతుక్కోవాలనే
ఆలోచన రాదు కనుక,
వాటి గొప్పతనం తెలుసుకోలేక
పోవడం సత్యమే!
No comments:
Post a Comment